వార్నీ..కోడలు పిల్ల శోభిత మామ నాగార్జునను అలా పిలుస్తుందా ..? పూర్తిగా వరుసలు మార్చేసారుగా..!
అయితే అదే పద్ధతిని చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉండటం మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కాగా రీసెంట్గా శోభిత ధూళిపాళ్ల కూడా ఆ కారణంగానే సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కూడా ఎదురుకుంటుంది. మనకు తెలిసిందే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలుగా మారిపోతుంది. అక్కినేని నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకోబోతుంది. త్వరలోనే వీళ్ల పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరగబోతుంది .
ఇప్పుడే వీళ్ళ పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభించారు. డిసెంబర్ 4వ తేదీ వీళ్ల పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే క్రమంలో పెళ్లి తర్వాత నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ముంబైలో సెటిల్ కాబోతున్నారు అంటూ కూడా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి . కాగా నాగచైతన్య భార్యగా మారిపోతున్న శోభిత ..నాగచైతన్య తండ్రి అయిన నాగార్జునను పద్ధతి ప్రకారం మామ అంటూ మామగారు అంటూ పిలవాలి .
అయితే ఇంగ్లీష్ ట్రెండ్ బాగా ఫాలో అయ్యే శోభిత మాత్రం నాగార్జునను అంకుల్ అంకుల్ అంటూ పిలుస్తుందట . ఇది అక్కినేని ఫ్యాన్స్ కే కాదు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇబ్బందికరంగా ఉంది . అంతకు ముందు మాజీ కోడలు సమంత మాత్రం నాగార్జునను మామా మామ అంటూ బాగా ట్రెడిషనల్ గా పిలిచేదట. శోభిత మాత్రం అంకుల్ అంటూ పిలవడంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కి అదేవిధంగా కుటుంబ సభ్యులు డిసప్పాయింట్ అవుతున్నారు. కోడలు పిల్ల ఈ రేంజ్ లో మారిపోయింది ఏంటి ..? అంటూ ఇంగ్లీష్ కోడలు పిల్ల అంటూ సరికొత్తగా శోభిత ధూళిపాళ్లను ట్రోల్ చేస్తున్నారు..!