మొదటి సినిమాలోనే అలాంటి పని.. బాలయ్య కొడుకు టూ రొమాంటిక్ రా బాబోయ్..!

Thota Jaya Madhuri
మనకు తెలిసిందే కోట్లాదిమంది నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేసినా బిగ్ అనౌన్స్మెంట్ రానే వచ్చేసింది. నందమూరి ఫ్యామిలీ నుండి మరోతరం హీరోగా మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీని గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. బాలయ్య తండ్రి పెద్ద స్టార్ హీరో . బాలయ్య కూడా సూపర్ స్టార్ హీరోనే. ఇప్పుడు బాలయ్య కొడుకుగా వస్తున్న మోక్షజ్ఞ కూడా అంత పెద్ద స్టార్ హీరో అవ్వాలి అంటూ నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు .


అయితే గతంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ లుక్స్ పై ఎలాంటి దారుణమైన ట్రోలింగ్ జరిగిందో మనకు తెలుసు. వాటిని అన్నిటిని సమర్ధవంతంగా ఎదుర్కొని మోక్షజ్ఞ లుక్స్ మొత్తం మార్చేసుకున్నాడు . అక్కల సపోర్ట్ తో డైటీషియన్ ను  మార్చి పర్ఫెక్ట్ హీరో కి ఉండాల్సిన  కరెక్ట్ షేప్పింగ్ లోకి వచ్చాడు . అంతేకాదు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.


ఈ సినిమాలో హీరోయిన్గా స్టార్ హీరోయిన్ కూతుర్ ని సెలెక్ట్ చేసుకోబోతున్నారట .తాజాగా ఈ సినిమా నుంచి మరొక వార్త బయటకు వచ్చింది . ఈ సినిమాల్లో మోక్షజ్ఞ యాక్షన్ పాత్రే కాకుండా లవర్ బాయ్ గా కూడా కనిపించబోతున్నారట . అంతేకాదు ప్రశాంత్ వర్మ కొంచెం ఘాటుగానే మోక్షజ్ఞపై సీన్స్ కూడా రాసాడట . మరి ముఖ్యంగా  ఈ సినిమాలో మోక్షజ్ఞ హీరోయిన్ కి లిప్ లాక్ ఇచ్చే సీన్ హైలెట్ గా మారిపోతుంది అంటూ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . కానీ బాలయ్యకు మాత్రం మొదటి సినిమాలోని అలా కొడుకు లిప్ లాక్ సీన్స్ లో నటించడం ఇష్టం లేదట . కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఆ సీన్స్ లో నటిస్తేనే పిల్లాడి కెరియర్ బాగుంటుంది.. అప్పుడు ఆయన ఇంకా స్టార్ స్టేటస్ లోకి వస్తాడు.  అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది అంటూ చెప్పుకొస్తున్నారట. మొదటి  సినిమాలోనే లిప్ లాక్ సీన్స్ లో నటించడం అంటే కొంచెం టెన్షన్ పడాల్సిన విషయమే.  అయితే బ్యాక్ గ్రౌండ్ నందమూరి ఫ్యామిలీ ఉంది కాబట్టి మోక్షజ్ఞకు ప్లస్ గా మారొచ్చు . చూద్దాం మరి బాలయ్య ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: