తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఏ స్టార్ డైరెక్టర్ రిస్క్ చేయని సమయంలోనే శంకర్ భారీ బడ్జెట్ తో భారీ సినిమాలు తెరకెక్కించి అద్భుతమైన విజయాలు అందుకున్నాడు.. కానీ ప్రస్తుతం శంకర్ సిట్యుటేషన్ అంత చెప్పుకోదగ్గగా లేదు.. హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీసిన శంకర్ ప్రస్తుతం నాసిరకం కథలతో నానా తంటాలు పడుతున్నాడు.. శంకర్ రీసెంట్ గా తెరకెక్కించిన ఇండియన్ 2 శంకర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.. ఇండియన్ 2 చూసి శంకర్ సినిమానేనా ఇది అని ప్రశ్నించని ప్రేక్షకుడు లేడు..ప్రస్తుతం శంకర్ 'గేమ్ ఛేంజర్'మరియు 'ఇండియన్ 3' ప్రాజెక్టులపై పూర్తి ఫోకస్ పెట్టారు.ఇండియన్ 3' షూటింగ్ ఇప్పటికే పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రామ్ చరణ్‌తో చేస్తున్న 'గేమ్ ఛేంజర్' షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమా షూటింగ్ సుమారు 90% పూర్తయిందని సమాచారం.జనవరి 10న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే గేమ్ ఛేంజర్ సినిమాపై కూడా చాలా డౌట్స్ వున్నాయి.. గ్లోబల్ స్టార్ రేంజ్ అప్డేట్స్ లేవు, ఫ్యాన్స్ కూడా సినిమాపై అంచనాలు వదులుకున్నారు.. దీనితో గేమ్ ఛేంజర్ పై ప్రేక్షకులలో అనుమానం మొదలైంది.. ఇదిలా ఉంటే శంకర్ నెక్స్ట్ సినిమా ఏంటి..? ఆయన ఏ స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నారు..అనేది ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో అపరిచితుడు బాలీవుడ్ రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.. అలాగే ఈ సినిమాలో రన్వీర్ సింగ్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.. గేమ్ ఛేంజర్ తరువాత శంకర్ బాలీవుడ్ వెళ్తాడా లేదా చూడాలి.. శంకర్ భారీ బడ్జెట్ సినిమాలకు బాలీవుడ్ వారే కరెక్ట్ అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.