కృష్ణ ఆస్తుల్లో మహేష్ బాబుకు వచ్చింది ఎంత.. అసలు మహేష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

praveen
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సూపర్ స్టార్ గా వెలుగొందిన అలనాటి హీరో కృష్ణ గురించి జనాలకి వేరే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఎన్టీయార్, నాగేశ్వరరావుల తర్వాత తన నటనతో తెలుగు సినిమా పరిశ్రమ మీద చెరగని ముద్ర వేశాడు. ముఖ్యంగా కృష్ణ ను ప్రొడ్యూసర్స్ హీరో అని అందరూ పిలుస్తూ ఉండేవారు. ఎందుకంటే? ప్రొడ్యూసర్స్ కి సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల ఏదైనా నష్టం వస్తే అప్పట్లోనే తన రెమ్యూనికేషన్ వెనక్కి తిరిగి ఇచ్చేవాడట సూపర్ స్టార్ కృష్ణ. అందుకే నిర్మాతల విభాగంలో ఆయనకి మంచి పేరు ఉండేది.
ఇక కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా తండ్రి వారసత్వాన్ని నిలుపుకుంటూ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇక మహేశ్ సంపాదన గురించి ఇక్కడ జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం మహేశ్ తెలుగులో ఉన్న అగ్ర నటులలో ఒక్కడిగా వెలుగొందుతున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే కృష్ణ హీరోగా ఉన్నప్పుడు ఎంత మొత్తంలో డబ్బులు సంపాదించాడు? తన వారసులు, కూతుళ్ళకి ఎలా పంచిపెట్టి ఇచ్చాడు అనే అంశంపైన చాలమందికి ఓ డౌట్ ఉంది. అలాంటివారికోసమే ఈ స్టోరీ.
హీరో కృష్ణగారికి ఇద్దరు కొడుకులు అనే విషయం తెలిసిందే. అందులో ఒకరు రమేష్ బాబు కాగా, మరొకరు మహేష్ బాబు. ఈ ఇద్దరు కొడుకులకి చెరో 3000 కోట్ల రూపాయలను కృష్ణ ఆస్తిగా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూడు వేల కోట్లతో పాటు మహేష్ మరొక 3000 కోట్ల ఆస్తులను కలుపుకొని మొత్తం 6000 కోట్లకు అధిపతి అని అంటున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం సినిమాల్లో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూనే, యాడ్ ఫిలిమ్స్ తర్వాత కూడా చాలా పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ దక్కించుకుంటున్నాడని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమౌళితో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ లో సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం, ఆయన రెమ్యూనరేషన్ తారా స్థాయిలో పెంచే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: