సీనియర్ హీరోయిన్ ఊర్వశి కూతురు భలే ఉంది బాసు.. అందంలో తల్లినే మించిపోయిందిగా..!
ఇక ఊర్వశి సినిమాల విషయం పక్కన పెడితే .. ఈమె వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు .. ఈమె 2000లోమలయాళ నటుడు మనోజ్ జైన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీరికి ఒక కూతురు కూడా ఉంది ఆమె పేరు లక్ష్మి . అయితే ఆ తర్వాత వీరి మధ్య మనసుపద్దులు రావడంతో ఊర్వశి , మనోజ్ విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఊర్వశి కూతురు తేజ లక్ష్మి విషయానికొస్తే.. సోషల్ మీడియాలో ఈమె ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.. అచ్చం ఊర్వశిలా ఉంటుంది. కుంజత మోడ్రన్ లుక్‌లో సామాజిక సోషల్ మిడియలో తరుచుగా కనిపిస్తుంటుంది.
అయితే కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ తన కూతురు తేజ లక్ష్మి కూడా త్వరలోనే సినిమాల్లో అడుగుపెట్టనుందని చెప్పకోచ్చింది. అయితే కుంజత్త ఇప్పుడు అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ మెటీరియలే అయినప్పటికీ కూడా వెరైటీగా కిక్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటోంది అని తెలుస్తుంది. అయితే తాజాగా కుంజత్త ట్రైనింగ్ తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక మరి భవిష్యత్‌లో నైనా ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి .