సామ్రాట్ Vs సాహస సామ్రాట్: అప్పట్లో రచ్చ... రచ్చ చేసి బాలయ్య బాబునే వెనక్కి నెట్టేసిందిగా..!

FARMANULLA SHAIK
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. రమేష్ బాబు కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు రమేష్ బాబు. ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు రమేష్ బాబు. చివరగా 1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌కౌంటర్ సినిమాలో నటించాడు. హీరోగా చేసిన రమేష్ బాబు ఆతర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు.సూపర్ స్టార్ కృష్ణ  కెరీర్ చాలా అద్భుతంగా వున్నప్పుడే తన పెద్ద కుమారుడు రమేష్ బాబు ని కూడా పరిశ్రమకి పరిచయం చెయ్యాలన్న ఉద్దేశంతో 'సామ్రాట్' అనే సినిమా ప్లాన్ చేశారు. అయితే అప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా రమేష్ బాబు మూడు నాలుగు సినిమాల్లో చేసాడు. ముందుగా 'అల్లూరి సీతారామరాజు'సినిమాలో చిన్నప్పటి రామరాజు గా కనపడతాడు రమేష్ బాబు. అలాగే 'దొంగలకు దొంగ', 'మనుషులు చేసిన దొంగలు', 'అన్నదమ్ముల సవాల్' సినిమాలలో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా వేసాడు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'నీడ' సినిమాలో కూడా రమేష్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు.కానీ కృష్ణ గారు, తన కుమారుడిని చాలా పెద్దగా పరిశ్రమకి పరిచయం చెయ్యాలని అనుకొని, కథల కోసాం వెతికారు. అప్పట్లో హిందీ సినిమా 'బేతాబ్'  ఒక సంచలనం సృష్టించింది. అది 1983లో విడుదలైంది, సన్నీ డియోల్  ఈ సినిమాతో పరిచయం అయ్యారు. కృష్ణ గారు ఆ 'బేతాబ్' సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలని నిశ్చయించుకొని దర్శకుడిగా వి మధుసూధనరావు  ని పెట్టి  సామ్రాట్ సినిమా తీశారు. ఇందులో సోనమ్ అనే హిందీ అమ్మాయిని కథానాయికగా పరిచయం చేశారు కృష్ణ గారు.ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈసామ్రాట్ సినిమా యావరేజ్ గా ఆడింది అని అంటారు.ఈ సినిమా తన సొంత బ్యానర్ అయినా పద్మాలయ స్టూడియోస్ మీదే నిర్మించారు. కృష్ణ గారి సోదరులు హనుమంతరావు నిర్వహణ, ఇంకో తమ్ముడు ఆదిశేషగిరి రావు నిర్మాతగా ఈ సినిమా 2-10-1987 విడుదలైంది. ఆ తరువాత రమేష్ బాబు కొన్ని హిట్ సినిమాలు ఇచ్చినా, ఎక్కువ కాలం పరిశ్రమలో నిలబడలేకపోయారు. 56 ఏళ్ల వయసులో రమేష్ బాబు అనారోగ్య సమస్యలతో మరణించారు.అయితే ఈ సినిమా టైటిల్ వివాదాస్పదం అయింది. అంతకు ముందు నిర్మాత కెసి శేఖర్ బాబు నందమూరి బాలకృష్ణ  తో 'సామ్రాట్' అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తున్నాను అని చెప్పారు. ఈ సినిమాకి రాఘవేంద్ర రావు  దర్శకుడు. అయితే కృష్ణ గారు 'సామ్రాట్' టైటిల్ తాను ముందు రిజిస్టర్ చేయించానని చెప్పినా, శేఖర్ బాబు వినకుండా అదే టైటిల్ తో తన సినిమా షూటింగ్ మొదలెట్టేసాడు. రెండు సినిమాలు 'సామ్రాట్' అనే టైటిల్ తో ప్రచారం కూడా చేశారు. అప్పట్లో పరిశ్రమలో ఇదొక పెద్ద సంఘటన అయింది. అప్పుడు పరిశ్రమలోని కొంతమంది పెద్దలు నిర్మాత శేఖర్ బాబు కి సర్ది చెప్పటం తో అతను తన సినిమాని 'సాహస సామ్రాట్' గా మార్చుకున్నారు అని చెపుతూ వుంటారు. అయితే ఇక్కడ ఆసక్తికరం ఏంటంటే టైటిల్ కోసం ఇంత తాపత్రయ పడిన బాలకృష్ణ సినిమా అదే సంవత్సరం ముందు ఏప్రిల్ నెలలో విడుదలైంది, పెద్ద ఫ్లాప్ కూడా అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: