విక్టరీ వెంకటేష్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ హీరోయిన్ వచ్చి సడన్ ట్విస్ట్ ఇచ్చిండా.. చేతికి రాఖీ కట్టి అన్నయ్యా అని పిలిచిందా.. ఇంతకీ వెంకటేష్ పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ హీరోయిన్ ఎవరు..ఆమె రాఖీ కట్టడం వెనక ఉన్న స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన వెంకటేష్ హీరోగా నిలదొక్కుకున్నారు. అయితే ఈయన సినిమాల్లోకి రాకముందే నీరజని పెళ్లి చేసుకున్నారు.వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సినిమాల్లోకి వచ్చాక వెంకటేష్ మరో హీరోయిన్ ని పెళ్లాడాలి అనుకున్నారట. తన భార్యకు విడాకులు ఇచ్చి వెంకటేష్ మరో వివాహం చేసుకుంటున్నారని ఇండస్ట్రీ మొత్తం గుసగుసలు పెట్టుకున్నారు. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు సౌందర్య.. వెంకటేష్ సౌందర్య కాంబినేషన్లో జయం మనదేరా, రాజా, పవిత్ర బంధం,పెళ్లి చేసుకుందాం రా, దేవీపుత్రుడు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సూపర్ పోలీస్ వంటి సినిమాలు చేశారు.
వీరి కాంబోలో ఎక్కువ సినిమాలు రావడమే కాదు ఆన్ స్క్రీన్ పై హిట్ పెయిర్ వీరికి ఎంతో మంచి గుర్తింపు ఉంది.దాంతో వెంకటేష్,సౌందర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే సౌందర్య తో వెంకటేష్ సాన్నిహిత్యంగా ఉండడం చూసిన రామానాయుడు కూడా వెంకటేష్ ని చాలాసార్లు మందలించారట. ఇక వెంకి భార్య నీరజ కూడా ఎక్కడ సౌందర్య మాయలో పడిపోతాడో అని బాధపడి రామనాయుడికి చెప్పడంతో రామానాయుడు ఓ రోజు సౌందర్య ఇంటికి నేరుగా వెళ్లి అసలు విషయం చెప్పాడట. కానీ సౌందర్య మాత్రం మీరు అనుకుంటున్నట్లు మీడియాలో వస్తున్నట్లు వెంకీకి నాకు మధ్య ఎలాంటి బంధం లేదు.
కేవలం సినిమాల వరకే మేమిద్దరం కెమిస్ట్రీ కోసం అలా ఉంటాం.కానీ తెర వెనుక మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అని క్లారిటీ ఇచ్చింది. కానీ బయట అందరి నోరులు మూయించాలంటే నువ్వు ఒక పని చేయాలి అని రామానాయుడు చెప్పారట. దానికి ఓకే చెప్పిన సౌందర్య నువ్వు నా కొడుకుకి రాఖీ కట్టాలి అని చెప్పడంతో సౌందర్య మనసులో వెంకటేష్ పై ఎలాంటి దురుద్దేశం లేకపోవడంతో వెంటనే వెళ్లి వెంకటేష్ కి రాఖీ కట్టిందట. అయితే ఈ విషయం అప్పట్లో టాలీవుడ్ లో పెద్ద సెన్సేషన్ అయినప్పటికీ ఈ విషయంపై ఎక్కువ రచ్చ చేయలేదు.దాంతో ఇది రూమర్ గానే మిగిలిపోయింది. ఇక ఈ విషయం తెలిసిన టాలీవుడ్ జనాలు మాత్రం పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయితో రాఖీ కట్టించుకున్న వెంకటేష్ అంటూ మాట్లాడుకున్నారు కానీ ఇందులో ఉన్నది ఎంత నిజమో మాత్రం తెలియదు