వరుణ్ తేజ్ ను వణికించిన "వాల్మీకి" టైటిల్ వివాదం..!
- కులం పేరుపై గన్ పెట్టి..
- వాల్మీకీ కులస్తులు హింసవాదులా..
సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. నటీనటులోని ఎంపిక చేసి సినిమా తీసే సమయంలో ముందుగా టైటిల్ లను రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ టైటిల్లో ఏమాత్రం తేడా వచ్చినా, మూవీ ఆగిపోతుంది. అలా ఎన్టీఆర్,ఏఎన్ఆర్ కాలం నుంచి ఎంతోమంది దర్శక నిర్మాతలకు హీరోలకు టైటిల్ వివాదాలు చుట్టుముంటాయి. ఈ తరం హీరోలలో వరుణ్ తేజ్ ను కూడా టైటిల్ వివాదం చుట్టుముట్టి ఇబ్బందులకు గురిచేసింది. మరి ఆ మూవీ ఏంటి దానివల్ల కలిగిన వివాదం ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
వాల్మీకి టైటిల్ వివాదం:
వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన మూవీ వాల్మీకి. ఈ చిత్రంపై తీవ్రమైనటువంటి వివాదం రాజుకుంది. అయితే ఈ టైటిల్ వాల్మీకి సామాజిక వర్గాన్ని కించపరిచినట్టు ఉందని, దీనిపై హీరో వరుణ్ తేజ్ దర్శకుడు హరీష్ శంకర్ క్షమాపణలు చెప్పాలని కోరారు. అంతేకాదు వాల్మీకి సామాజిక వర్గం రాష్ట్ర అధ్యక్షుడు దీనిపై హైకోర్టులో కేసు వేసి మా గురుదైవమైనటువంటి వాల్మీకిపై భక్తి ఆధ్యాత్మిక కథాంశంతో కూడిన సినిమా తీస్తే ఎలాంటి అభ్యంతరం ఉండదు.కానీ సినిమా పేరు వాల్మీకి పెట్టి రౌడీ రాజ్యం ఏలే సినిమా తీస్తే బాగుండదని హెచ్చరించారు. వెంటనే సినిమా పేరు మార్చుకోవాలని వారు కోర్టులో పిటిషన్ వేశారు. చివరికి దిగివచ్చిన చిత్ర యూనిట్ వాల్మీకి పేరు తీసేసి గద్దలకొండ గణేష్ గా సినిమా పేరు పెట్టి రిలీజ్ చేశారు.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. వరుణ్ తేజ్ లో కేవలం హీరోయిజం కాదు విలనిజం కూడా ఉంది అని తనలో ఉన్న యాక్టింగ్ ని బయటపెట్టిన సినిమాగా గద్దలకొండ గణేష్ మూవీ పేరు తెచ్చుకుంది.