మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ లో ఏ కాంబినేషన్ కి రానంత క్రేజ్ వీరి కాంబో కి వుంది.. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెం. 1.. ఈ సినిమా ఎన్టీఆర్, రాజమౌళి ఇద్దరి కెరీర్ లో మొదటి సూపర్ హిట్ గా నిలిచింది.. రాజమౌళి ఫస్ట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం.. ఇక ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ సింహాద్రి.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ రోజుల్లో టాప్ స్టార్ హీరోలు కూడా అందుకొని క్రేజ్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాతో అందుకున్నాడు..సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరీర్ని అమాంతం తారా స్థాయికి చేర్చింది.. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఆ సినిమా నిలిచింది.. ఇక వీరి కాంబోలో వచ్చిన మూడో సినిమా “యమదొంగ”.. యముడిగా ఎన్టీఆర్ గెటప్ అప్పట్లో ఎంతో ట్రెండింగ్ గా నిలిచింది.. ఎన్టీఆర్ కెరీర్ లో యమదొంగ అద్భుత విజయం సాధించింది.. ఈ సినిమాతో ఎన్టీఆర్ నటనలోని మరో కోణాన్ని రాజమౌళి చూపించాడు.ఈ సినిమా తరువాత రాజమౌళి పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయాడు.. చాలా ఏళ్ల తరువాత రాజమౌళి, ఎన్టీఆర్ కాంబో లో సినిమా సెట్ అయింది..
అయితే ఈ సినిమాలో రాంచరణ్ కూడా వచ్చి చేరడంతో ఆ సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి.. ఆ సినిమానే ‘ఆర్ఆర్ఆర్’..ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ అందుకొని తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచస్థాయికి చేరవేసింది.. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో ఇన్ని గొప్ప సినిమాలు అందించిన రాజమౌళి.. ఎన్టీఆర్ కెరీర్ కి శాపంగా కూడా మారాడు.. ఎన్టీఆర్ ని రాజమౌళి ఎవ్వరు చూపలేనంత పవర్ ఫుల్ గా సినిమాలో చూపిస్తాడు.. కానీ ఎన్టీఆర్ ఆ తరువాత చేసే సినిమాలలో ఆ రేంజ్ ఎలివేషన్ లేకపోవడంతో ఎన్టీఆర్ ఎంతో కాలం ప్లాప్స్ వల్ల ఇబ్బంది పడ్డాడు.. ఆ తరువాత రాజమౌళితో సినిమా చేసిన మళ్ళీ అదే సీన్ రిపీట్.. దీనితో రాజమౌళి సినిమాలకు ఎన్టీఆర్ బలైపోయడని అంతా భావించారు.. రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా హిట్ అయిన ఎన్టీఆర్ రేంజ్ విజయం మాత్రం దక్కించుకోలేకపోయింది.