' పుష్ప 2 ' .. నాన్ థియేట‌ర్ బిజినెస్ చూస్తే గుండె గుబేల్‌...!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాలలో పుష్ప2 ఒకటి. పుష్ప లాంటి భారీ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప2 పై దేశవ్యాప్తంగా క‌నివినీ ఎరుగని రేంజ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు నాన్ థియేటర్ మార్కెట్ ఒక రేంజ్ లో నడుస్తోంది. ఎంత అన్నదానిపై టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ ప్రశ్నకు నిర్మాత నవీన్ ఎర్నేని ఆసక్తికర ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ నాన్  థియేటర్ ఆదాయం రూ.420 కోట్లు అని నవీన్ ఎర్నేని ప్రకటించారు.

థియేటర్ ఆదాయంతో కలిపితే రూ.1000 కోట్ల బిజినెస్ జరిగినట్టు అనుకోవచ్చని.. ఆయన చెప్పకనే చెప్పారు. ఇక పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలవుతుందని అధికారింగా ప్రకటించారు. తాజాగా జరిగిన ఈ సమావేశానికి అన్ని ప్రాంతాల నుంచి పుష్ప 2 బయ్యర్లు వచ్చారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, నార్త్ ఇండియా బయర్లు హాజరయ్యారు. అలాగే నైజాం - వెస్ట్ గోదావరి బయ్యర్లు కూడా వచ్చారు. పుష్ప 2 సినిమా ఆలస్యం కావడానికి కేవలం బెటర్మెంట్ కోసమే తప్ప.. మరే కారణం లేదని అక్కడక్కడ కాస్త గ్యాప్‌లు కూడా వచ్చాయని రవి వెల్లడించారు.

ద‌ర్శ‌కుడు సుకుమార్ తో సంప్రదించిన తర్వాత రిలీజ్ డేట్ ని ఒకరోజు ముందుకు జరిపినట్టు నిర్మాతలు తెలిపారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో మిడ్ నైట్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు పుష్ప అనేది ఒక బ్రాండ్ అని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ అన్నారు. నార్త్ బెల్ట్ తో పాటు ఈస్ట్ అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు అనిల్ టాండ‌న్‌ తెలిపారు. కర్ణాటకలో రికార్డు సృష్టిస్తామని అభిలాష్ రెడ్డి తెలిపారు. ఏది ఏమైనా పుష్ప 2పై అంచనాలు మామూలుగా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: