కుర్ర హీరో కాన్ఫిడెన్స్ కి రీజన్ ఇదేనా..!

shami
యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం సెపరేట్ పంథాతో సినిమాలు చేస్తున్నాడు. తొలి సినిమా రాజా వారు రాణి గారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలు సక్సెస్ అందుకోగానే అతనికి వరుస ఛాన్స్ లు వచ్చాయి. ఐతే వాటిలో కథల విషయంలో కాస్త కన్ ఫ్యూజ్ అయ్యి ఫ్లాపులు అందుకున్నాడు. ఐతే ఆ ఫ్లాపుల నుంచి త్వరగానే పాఠాలు నేర్చుకున్న కిరణ్ అబ్బవరం ఇక మూస కథలకు మంగళం పాడేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే తన కొత్త సినిమా క తోనే శుభారంభం చేస్తున్నాడు. దర్శక ద్వయం సుజిత్ అండ్ సందీప్ డైరెక్షన్ లో క తో వస్తున్న కిరణ్ కాన్సెప్ట్ కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది.
లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ చూస్తే క గురించి కిరణ్ ఎందుకు ఇంత కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు అన్నది అర్ధమైంది. కొత్త కథ.. దానికి తగిన సెటప్ అంతా చేసినట్టు అర్ధమవుతుంది. ఈమధ్య తెలుగు ఆడియన్స్ థ్రిల్లింగ్ అంశాలకు ఎక్కువ అలవాటు పడ్డారు. అందుకే ఆ మీటర్ కి తగిన కథ కథనంతో క తెరకెక్కినట్టు తెలుస్తుంది. సినిమా ట్రైలర్ లో కథ చూచాయగా చెప్పినా అసలు టైం మిషన్ కాన్సెప్ట్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.
మొత్తానికి కిరణ్ అబ్బవరం లాంటి యువ హీరో తానేం చేయగలడో చూపించేలా క సినిమా ట్రైలర్ ఉంది. ట్రైలర్ చూసిన ఎవరైనా పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతారు. మరి ఇదే ఊపు రిలీజ్ తర్వాత కూడా ఉంటే క కచ్చితంగా మరో సూపర్ హిట్ బొమ్మ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఈ సినిమాతో కిరణ్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నాడు తప్పకుండా ఈ సినిమా మరోసారి తెలుగు పరిశ్రమ పేరుని దేశమంతా వినిపించేలా చేస్తుందని చెప్పొచ్చు. కిరణ్ సినిమాపై పూర్తి నమ్మకంగా ఉండగా ట్రైలర్ చూసిన ఆడియన్స్ కూడా సూపర్ అనేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: