ప్రెగ్నెన్సీ మహిళల్లో అయోడిన్ లోపిస్తే జన్మించే పిల్లలకు ‌ ఎటువంటి ప్రాబ్లంలో తెలుసా..!

lakhmi saranya
ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలన్న సంగతి తెలిసిందే. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలన్న సంగతి కూడా తెలిసిందే. ఆహారం బాగా తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉంటారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే ఆహారం బాగా తీసుకోవాలి. అయోడిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మానవ శరీరంలో అయోడిన్ లోపిస్తే భయంకరమైన లక్షణాలు కనిపిస్తాయి:కాగా కనీస మోతాదులో అయోడిన్ కలిగిన సాల్ట్ తీసుకోవాలి. అయోడిన్ లోపిస్తే గుండె వేగం తగ్గుతుంది. గొంతు నొప్పి వస్తుంది. హెయిర్ ఫాల్ అవ్వడం, వాపు, అదిగా నిద్ర, విపరీతమైన నిద్ర వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ముఖ్యంగా ప్రెగ్నెన్సీ మహిళల్లో అయోడిన్ లోపిస్తే మానసిక, శారీరక అభివృద్ధి పై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు నిపుణులు. గర్భిణీల్లో అయోడిన్ లోపిస్తే గర్భాస్రావం, వికలాంగు శిశువు, పిల్లల్లో మరుగుజ్జు, నవజాత శిశువులు, అంధత్వం, చెవుడు, లైంగిక అభివృద్ధి లేకపోవడం, నత్తిగా మాట్లాడడం, మానసిక సమస్యలు, గొంతుబొంగురు పోవటం, కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా చరుకుదనం కోల్పోతారు. తరచూ నీరసంగా ఉంటారు. శరీరంపై కురుపులు అవుతాయి. ఊబకాయం, లైంగిక ఉదాసినత వంటి ప్రాబ్లమ్స్ వంటివి వస్తాయి. కాగా ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి రోజు లిమిట్స్ లో అయోడిన్ ఉప్పు తీసుకోవటం మంచిదంటున్నారు నిపుణులు.
 కానీ అయోడిన్ తక్కువ పరిణామంలో తీసుకోవాలి. ప్రతిరోజు కేవలం 150 మేక్రోగ్రాములు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పిల్లలకైతే 50 మైక్రో గ్రాములు, ప్రెగ్నెన్సీ మహిళలు 200 మైక్రో గ్రాములు తీసుకుంటే చాలు. కాబట్టి ప్రెగ్నెంట్ గా ఉన్నవారు దీనిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఉప్పును అస్సలు వాడకండి. ఉప్పుని వాడటం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. తగినంత ఉప్పు ని మాత్రమే వాడండి. కొంతమంది ఉప్పుని మరీ ఎక్కువగా తింటూ ఉంటారు. అలా తినటం వల్ల బిపి మరింతగా పెరిగిపోతుంది. కంట్రోల్లో ఉంచడం కష్టం అవుతుంది. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: