ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి డిజిట‌ల్ ... క‌ళ్లు చెదిరి... మైండ్ బ్లాక్ అయ్యే రేటు ఇది...!

RAMAKRISHNA S.S.
ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే చాలు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు కర్ణాటక , తమిళనాడు , కేరళ మరియు ముఖ్యంగా బాలీవుడ్ నార్త్ ఇండియా లో అయితే కని విని ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉంటున్నాయి .. ప్రస్తుతం ప్రభాస్ కేవలం టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాదు దేశం మొత్తం మెచ్చిన గొప్ప పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు .. ప్రస్తుతం ప్రభాస్ మారుతీ దర్శకత్వం లో రాజా సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .. ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సలార్ 2 సినిమా కూడా తెరకెక్కనుంది ..

ఆ తర్వాత కల్కి సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుంది .. ఇక‌ మధ్యలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ఉంటుంది . అలాగే మైత్రి సంస్థ ప్రభాస్ హీరోగా హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేసింది . ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఓటీటీ అంటే డిజిటల్ హక్కులు అప్పుడే అమ్మేసినట్టు తెలుస్తోంది .. ఈ సినిమా సౌత్ ఇండియా డిజిటల్ హక్కులు రూ. 150 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది . నాన్ థియేటర్ హక్కుల్లో మేజర్ షేర్ ఈ డిజిటల్ హక్కులే వి కాకుండా సాటిలైట్ ఆడియో హిందీ ఇలా రకరకాలు ఉంటాయి ..

అవన్నీ కలిపి మరో రూ. 150 కోట్లకు పైగా వస్తాయి అంటే ఒక నాన్ థియేటర్ హక్కులే  రూ. 30 కోట్లకు పైగా వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది . ఈ సినిమా విడుదలకు ముందు థియేటర్ బిజినెస్ ఎలాగూ అదిరిపోతుంది . సినిమా నిర్మాణ ప‌నులు కూడా అదే రీతిలో ఉంటుందని సినిమా పిరియాడిక్ డ్రామా కావటం సెట్ లు , సిజి పనులు కూడా ఎక్కువగా ఉంటాయని రెమ్యూనరేషన్ కూడా అలాగే ఉంటాయని తెలుస్తోంది . ఏది ఏమైనా ఈ సినిమా పేరుతో మైత్రి సంస్థకు భారీ లాభాలు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: