అక్క-చెల్లెల మధ్య మొదలైన గొడవ.. ఇప్పుడు అసలు నిజానిజాలు బయటపడేది..!
అయితే ప్రెసెంట్ అలాంటి ఒక క్రిటికల్ సిచువేషన్ ని ఎదుర్కొంటున్నారు కన్నడ అక్క చెల్లెలుగా పిలిపించుకునే శ్రీలీల - రష్మిక మందన్నా. మనకు తెలిసిందే రష్మిక మందన్నా కన్నడ బ్యూటీ. శ్రీలీల కూడా కన్నడ బ్యూటీనే . ఇద్దరు కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్స్ గా మారారు. రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా మారిపోతే శ్రీలీల అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . పలు సినిమాలతో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నారు ఈ బ్యూటీస్.
అయితే రామ్ చరణ్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం సెకండ్ హీరోయిన్ గా రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట సుకుమార్ . అయితే రష్మిక మందన్నా కన్నా ఆ పాత్రకు శ్రీ లీల బాగుంటుంది అని కొంతమంది సజెస్ట్ చేయడంతో ఆమె ని మళ్లీ ఆ పాత్రలో తీసుకోవడానికి ఆలోచిస్తున్నారట సుకుమార్. అయితే ఆల్రెడీ రష్మిక మందన్నాతో చర్చలు కూడా జరిపారట సుకుమార్. ఇప్పుడు ఇదే పెద్ద మైనస్ గా మారింది . రెమ్యునరేషన్ పరంగా సుకుమార్ ఎవరు తక్కువగా ఓకే చేస్తే వాళ్ళను ఫైనలైజ్ చేయాలనుకుంటున్నారట.
రష్మిక మందన్నా ఒక సినిమాకి 7 కోట్లు తీసుకుంటుంది . శ్రీ లీల నాలుగు కోట్లు మూడు కోట్లు తీసుకుంటుంది . అయితే ఈ కారణంగా ఈ సినిమాలో ఆల్మోస్ట్ శ్రీలీల కన్ ఫాం అంటున్నారు జనాలు . ఇక్కడే వీళ్లకు పెద్ద గొడవ స్టార్ట్ అయ్యింది. ఏ విషయాన్ని అయినా రష్మికతో షేర్ చేసుకుంటూ చాలా క్లోజ్ గా ఉండేదట శ్రీలీల. అయితే శ్రీలీలను చెల్లెలు గా భావించిన రష్మిక అన్ని విషయాలల్లో హెల్ప్ కూడా చేసేదట. ఇప్పుడు చెల్లెలే అక్క ఆఫర్ దొబ్బేయడంతో సినీ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వీళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయని ఇప్పుడు ఇద్దరూ నిజస్వరూపాలు బయటపడబోతున్నాయి అని మాట్లాడుకుంటున్నారు జనాలు..!!