పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాంటి స్థాయిలో ఉన్నారో చెప్పనక్కర్లేదు.అయితే అలాంటి పవన్ కళ్యాణ్ ని నీ మొహానికి నేను కావాలా అంటూ ఓ అమ్మాయి మొహం మీదే తన ప్రేమని రిజెక్ట్ చేసిందట.మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..అనేది ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు అంటే చదువుకునే సమయంలో చెన్నైలో కంప్యూటర్ క్లాస్ కి వెళ్లేవారట. ఇక అప్పటికే చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు.దాంతో పవన్ కళ్యాణ్ ని చిరంజీవి తమ్ముడుగా చాలామంది గుర్తుపట్టేవారు. అలా పవన్ కళ్యాణ్ కంప్యూటర్ క్లాస్ లకి వెళ్తున్న సమయంలో ఆ కంప్యూటర్ క్లాస్ కి ఒక అందమైన అమ్మాయి వచ్చేదట.అయితే ఆ అమ్మాయితో చాలామంది అబ్బాయిలు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఆ అమ్మాయి ఎవరితో కూడా మాట్లాడకుండా కేవలం పవన్ కళ్యాణ్ తోనే మాట్లాడేదట.
ఎందుకంటే అప్పటికే చిరంజీవి హీరో కాబట్టి హీరో తమ్ముడు అనే ఇష్టంతో పవన్ కళ్యాణ్ తో మాటలు కలిపేదట. అయితే ఈ విషయం గమనించిన చాలామంది కంప్యూటర్ క్లాసులో ఉన్న పవన్ కళ్యాణ్ తోటి ఫ్రెండ్స్ అందరూ మా ఎవరితో మాట్లాడకుండా నీ ఒక్కడితోనే మాట్లాడుతుంది అంటే ఆమె నిన్ను ప్రేమిస్తుంది కావచ్చు. ఆమె ఓపెన్ అవ్వడం లేదు..నువ్వైనా ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పు అని ఫ్రెండ్స్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ కూడా నిజమే అనుకున్నారట. దాంతో ఓసారి ఆమె నీ బయటికి తీసుకువెళ్లి తన ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నారట. ఇక అప్పట్లో పవన్ కళ్యాణ్ కి ఒక కారు ఉండేదట. ఆ కారులో ఆమెను బయటికి తీసుకువెళ్లాలని ప్లాన్ చేశారట. ఇక అనుకున్నట్లే ఓ రోజు బయటికి వెళ్దామని ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని కొద్ది దూరం ప్రయాణించాక మీరంటే నాకు ఇష్టం అని తన లవ్ ప్రపోజ్ చేశారట.
కానీ ఈ విషయం పవన్ కళ్యాణ్ నోటి నుండి రావడంతోనే నీకు నేను ఎలా కనిపిస్తున్నాను.. నీ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి.. ఏదో ఫ్రెండ్ లా మాట్లాడాను. దానికే నువ్వు ప్రేమ అనుకుంటున్నావా అంటూ మొహం మీదే పవన్ కళ్యాణ్ ని తిట్టేసిందట. ఇక ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన పవన్ కళ్యాణ్ కంప్యూటర్ క్లాసులు అయిపోయే వరకు కూడా మళ్లీ ఆమెతో మాట్లాడలేదట. అలా తన లైఫ్ లో మొదటి లవ్ స్టోరీ ఇదే అంటూ పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇది విన్న పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఎవరైతే పవన్ కళ్యాణ్ ని అప్పుడు రిజెక్ట్ చేసిందో ఆమె ఇప్పుడు కుళ్లుకుంటుంది కావచ్చు. ఎందుకు అప్పుడే పవన్ కళ్యాణ్ ని ఒప్పుకోలేదా అని ఎంత బాధ పడుతుందో అంటూ కామెంట్లు పెడుతున్నారు