అజిత్ తో పెద్ద గొడవ.. షూటింగ్ నుండి తప్పుకున్న త్రిష.?

Pandrala Sravanthi
 కోలీవుడ్ నటుడు అజిత్ అంటే పరిచయాలు అక్కర్లేని పేరు.ప్రస్తుతం త్రిష అజిత్ కాంబినేషన్లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా వస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాకి సంబంధించి కోలీవుడ్ మీడియాలో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతుంది.అదేంటంటే.. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా షూటింగ్లో నుండి త్రిష తప్పకుందని ఇద్దరి మధ్య గొడవ వల్లే త్రిష ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.మరి ఇంతకీ త్రిష సినిమా షూటింగ్ నుండి తప్పకుంది అంటూ వస్తున్న వార్తల్లో ఉన్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం.. త్రిష ప్రస్తుతం విశ్వంభర, గుడ్ బ్యాడ్ అగ్లీ, విడాముయర్చి, థగ్ లైఫ్ వంటి సినిమాల్లో నటిస్తుంది.ప్రస్తుతం సౌత్లో బిజీయెస్ట్ హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.అయితే అలాంటి ఈ హీరోయిన్ గురించి తాజాగా ఒక రూమర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. 

అదేంటంటే.. ప్రస్తుతం అజిత్ తో కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా షూటింగ్లో భాగంగా త్రిష స్పెయిన్లో ఉంది. స్పెయిన్ లో ప్రస్తుతం ఈ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఉన్నట్టుండి స్పెయిన్ నుండి త్రిష చెన్నైకి రావడంతో మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. త్రిష షూటింగ్ జరుగుతున్న సమయంలో అజిత్ తో గొడవ జరగడంతో ఇద్దరు మధ్య మాట మాటా పెరిగి త్రిష సినిమాలో నటించలేను అని చెప్పేసి స్పెయిన్ నుండి చెన్నైకి తిరిగి వచ్చేసినట్టు ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది.

దీంతో చాలామంది నెటిజన్స్ నిజంగానే త్రిష గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నుండి తప్పకుందా ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు. అయితే కోలీవుడ్లో మరో మ్యాటర్ వినిపిస్తోంది. అదేంటంటే త్రిష స్పెయిన్ నుండి చెన్నైకి రావడానికి కారణం అజిత్ తో గొడవ కాదని, ఆమె ఓ నగల ప్రకటనలో నటించడం కోసమే చెన్నైకి వచ్చిందని మరి కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ త్రిష ఉన్నట్టుండి స్పెయిన్ వదిలి చెన్నైకి రావడంతో కోలీవుడ్ మీడియాలో రూమర్లు ఊపందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: