పదేళ్ల కార్తికేయ : ఫ్రీ రిలీజ్ బిజినెస్.. టోటల్ కలెక్షన్ల వివరాలు ఇవే..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం నిఖిల్ హీరోగా స్వాతి హీరోయిన్గా చందు మండేటి దర్శకత్వంలో కార్తికేయ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా 2014 వ సంవత్సరం అక్టోబర్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమాకు విడుదల అయిన తరువాత జనాల నుండి మంచి టాక్ రావడం మొదలు అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో పది సంవత్సరాలు పూర్తి అయింది. ఇక ఈ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసింది. ఏ రేంజ్ విజయాన్ని అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఫైనల్ బాక్స్ ఆఫీసర్ ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 2.52 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 85 లక్షలు , ఉత్తరాంధ్రలో 28 లక్షలు , ఈస్ట్ లో 40 లక్షలు , వెస్ట్ లో 25 లక్షలు , గుంటూరు లో 50 లక్షలు , కృష్ణ లో 35 లక్షలు , నెల్లూరు లో 12 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 5.87 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 27 లక్షలు , ఓవర్సీస్ లో 65 లక్షల కలెక్షన్లు దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 6.79 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగగా 6.79 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టి 1.79 కోట్ల లాభాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: