సినీ ఇండస్ట్రీ లో హీరోగా రానించాలంటే మాములు విషయం కాదు.. స్టార్ కిడ్స్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన టాలెంట్ లేకపోతే మాత్రం ఇండస్ట్రీలో నిలబడటం కష్టం. అయితే ఒక్కోసారి టాలెంట్‌తో పాటు,అదృష్టం కూడా కలిసి రావాలి. టాలెంట్ ఉండి అదృష్ట లేకపోతే మాత్రం చాలా కష్టం.. అలా ఇండస్ట్రీలో బోలెడంత టాలెంట్ వున్నా కానీ ఆవగింజ అంత అదృష్టం లేని హీరోలు చాలా మంది వున్నారు..వారిలో హీరో సుధీర్ బాబు ఒకరు.. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. తన మొదటి సినిమా ఎస్ఎంఎస్ మూవీలో మంచి టైమింగ్ తో ఆకట్టుకున్న సుధీర్ బాబు ఆ తరువాత వచ్చిన ప్రేమ కథా చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు.. ఆ సినిమా సుధీర్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఆ తరువాత సినిమా నుంచి సుధీర్ బాబుకి అసలు కష్టాలు మొదలయ్యాయి..చేసిన ప్రతి సినిమా ఢమాల్ అనేది..టాలెంట్ చాలా ఉన్నప్పటికీ సుధీర్ బాబుకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ ఇచ్చే సినిమా రాలేదనే చెప్పాలి.
తెలుగులో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. నిజానికి సుధీర్ బాబు, ఒక సినిమాకు ఎంత కష్ట పడాలో అంతకు మంచి కష్టతుంటాడు.. కానీ ఆయన కష్టానికి తగిన ఫలితం మాత్రం రావడం లేదు. నిజానికి సుధీర్ బాబు కేవలం తన కష్టం మీదే పైకొచ్చాడు..సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ సపోర్ట్ వున్నా కానీ అది కేవలం తన మొదటి సినిమాకే పనికొచ్చింది..ఆ తరువాత ప్రతి సినిమాకు తనలోని యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ వచ్చాడు. ఈ ఏడాది సుధీర్ బాబు నటించిన హరోంహర సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. కానీ.. కమర్షియల్‌గా అంతగా విజయం సాధించలేకపోయింది. ఇప్పటివరకు సుధీర్ బాబు 18 సినిమాల్లో నటిస్తే.. అందులో 16 సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి... కేవలం 2 మాత్రమే విజయం సాధించాయి... దీనితో సుధీర్ బాబుకు హిట్ అందని ద్రాక్ష లా మారింది..