అఖిల్-శ్రేయ విషయంలో జరిగిన అదే తప్పు..ఇప్పుడు చైతన్య-శోభిత మ్యాటర్ లో.. పెళ్లికి ముందే ఈ గొడవలు ఏంటి..!

Thota Jaya Madhuri
పెళ్లి కాకముందే నాగచైతన్య ధూళిపాళ్ళ గొడవ పడుతున్నారా ..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది.  మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య అలాగే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లికి సంబంధించిన మ్యాటర్ ఎలా ట్రెండ్ అవుతూ వస్తుందో. వీళ్ళకి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే  అది ప్రేమ కాదు అంటూ కొట్టి పడేశారు. కానీ నిశ్చితార్థం చేసుకుని జంటగా దర్శనమిచ్చారు. త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. రీసెంట్గా శోభిత ధూళిపాళ్ల పసుపు దంచే ఫంక్షన్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఆమె పసుపు దంచే ఫంక్షన్ లో కట్టుకున్న చీరకి సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి .


సాంప్రదాయం ప్రకారం అక్కినేని నాగార్జున అక్కినేని అమల ..శోభిత ధూళిపాళ్లకు ప్రత్యేకంగా పట్టు చీరను కొనిచ్చారట.  కానీ నాగచైతన్య తల్లి నాగార్జున మొదటి భార్య లక్ష్మీ ఎంతో ఇష్టంగా శోభిత కు చీర పెట్టడంతో  ఆమె ఆ చీరనే కట్టుకునిందట. అయితే ఇప్పటికే ఈ విషయం కారణంగా అమలా -  నాగార్జున గుర్రుగా ఉన్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . అయితే నాగచైతన్య .. అమలకు సారీ చెప్పమంటూ శోభితను రిక్వెస్ట్ చేశారట . అయినా కూడా శోభిత  అసలు నా తప్పు లేనిదే నేను ఎందుకు సారీ చెప్పాలి అంటూ తెగేసి మాట్లాడుతుందట.


ఇద్దరు అత్తగారులే కానీ నీ తల్లిగా లక్ష్మీ గారే నా ఒరిజినల్ అత్తగారు ఆమె చెప్పినట్లే నేను పాటించాలి అంటూ నాగచైతన్య  తల్లి లక్ష్మి కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుందట . అంతేకాదు అక్కినేని అమలను అసలు పట్టించుకోవడం లేదట . ఎంత లేదన్న అక్కినేని నాగార్జున భార్య అమల నాగచైతన్యకు సవతి తల్లి అయినా ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలిగా ..శోభిత  ఒకసారి సారీ చెప్తే ఏం పోతుంది అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ .


కొంతమంది మాత్రం శోభితానే కరెక్ట్ అంటున్నారు.  ఆమె పని ఆమె చేసింది అసలు ఆమె తప్పేముంది అంటున్నారు . కాగా గతంలో ఇదే విషయం కారణంగా అఖిల్ - శ్రేయ భోపాల్ కూడా  విడిపోయారు . అమలకు.. శ్రేయ భూపాల్ రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అన్న కారణంగానే అఖిల్ ..శ్రేయ భూపాలను దూరం పెట్టాడు . ఆ గొడవలు పెరిగి పెరిగి పెద్దవిగా మారి జరిగిన నిశ్చితార్ధాని రద్దు చేసుకున్నారు . ఇప్పుడు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మధ్య కూడా అదే గొడవ రావడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: