ఒక్క రోజు ముందే ' పుష్ప 2 ' సినిమా చూస్తారా... ఇది మీ కోస‌మే..!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ హీరో అయిపోయారు. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న పుష్ప పార్ట్ 2 వస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు. అంతకు ముందు రోజు అంటే డిసెంబర్ 5న ప్రీమియర్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కానీ.. ఇప్పుడు నిర్మాత ల‌ ప్లాన్ మారిందని తెలుస్తోంది. డిసెంబర్ 5న రిలీజ్ చేసి డిసెంబర్ 4 నుంచి ప్రీమియర్ షోలు వేయాలని భావిస్తున్నారు. పుష్ప ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఏకంగా నార్త్ లో రూ.100 కోట్ల షేర్ రాబట్టింది.

దీంతో పుష్ప 2 పై సౌత్ కంటే నార్త్ లో కనివిని ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఒక నార్త్ ఇండియాలో ఈ సినిమా రూ.300 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది. అంటే పుష్ప 2 పై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో తెలుస్తోంది. చాలా గ్రాండ్‌గా పుష్ప 2 రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈరోజు నుంచి పుష్ప 2 ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీపావ‌ళి సందర్భంగా పుష్ప 2 నుంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. పుష్పాకు సంబంధించి టాకీపార్టు దాదాపుగా పూర్తయింది. ఇంకా రెండు పాటలు బాకీ ఉన్నాయి అంటున్నారు.

ఈ రెండు పాటల్లో ఒకటి ఐటెం సాంగ్. నవంబర్‌లో ఈ ఐటెం సాంగ్ షూట్ చేస్తారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ శ్రద్ధ కపూర్ ఈ పాటలో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే బిజినెస్ రూ.1065 కోట్లకు చేరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. పాహద్ ఫాజిల్ కీలకపాత్రలో కనిపించారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: