దేవరను ఇంకా వదలని మెగా ఫాన్స్.. గేమ్ ఛేంజర్‌ను ముంచేస్తారుగా..!

Amruth kumar
దేనికైనా ఒక లిమిట్ ఒక స్థాయి ఉంటుంది.. మన పరిస్థితి అనుకూలంగా ఉందా లేదా అని తెలుసుకుని రెచ్చిపోతే అందరికీ బాగుంటుంది. అంతా మనకే అనుకూలంగా ఉందని .. ఎలా పడితే అలా చేస్తే అది చివరికి మనకే తగులుతాయి. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ముందు వెనక చూడకుండా దేవరను టార్గెట్ చేస్తున్న విధానం చూసి ఫాన్స్ లోనే కొందరికి ప్యాంట్లు తడిసిపోతున్నాము. అనవసరమైన సమస్యను  తెచ్చి మెగా ఫ్యామిలీ సినిమాలను  నాశనం చేస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దేవర సినిమా  మొదటి అప్డేట్ వచ్చినప్పటి నుంచి కొరటాల శివ మీదున్న కోపాన్ని ఎన్టీఆర్ మీద చూపించి దేవరన్ని అన్ని విధాలుగా టార్గెట్ చేశారు. చివరకు న్టీఆర్ నటన విషయంలో కూడా మెగా అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వారికి పెద్ద తలనొప్పిగా తయారైంది.

లేనిపోని సమస్యలు వద్దని కొందరు చెబుతున్న మెగా అభిమానులు మాత్రం ఎక్కడా ఆగక పోవడం ఇప్పుడు ఆ సమస్యను ఎక్కడికి తీసుకు వెళుతుంది అనే భయం వారిలో మొదలైంది. టాలీవుడ్ లో ఇప్పుడు మెగా ఫాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ అనే విధంగా వాతావరణం తయారైంది. హిందీలో దేవర సినిమాను 15 కోట్లకు అమ్మేరు.. ఆ హ‌క్కులను బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరన్ జోహార్ కొనుక్కున్నాడు. అలానే  బాలీవుడ్లో ప్రమోషన్ విషయంలో కూడా భారీగాని ఖర్చు పెట్టాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది.. ఇక సినిమాను ప్రమోట్ చేయడానికి అలాగే భారీ బజ్‌ క్రియేట్ చేయడానికి ఎన్టీఆర్ మాటలతో.. టికెట్లను భారీగా బుక్ చేయించాడనే ప్రచారం ఒకటి లేపారు.

అది ఎంత వరకు నిజమనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పుడు మాత్రం 100 కోట్లతో టికెట్లు బుక్ చేయించాడని ఆ డబ్బులు ఇంకా దేవరకు రాలేదని ధర్మా ప్రొడక్షన్ హౌస్ నష్టాల్లోకి వెళ్లిందని అబద్ధపు ప్రచారాన్ని బయటకు తీశారు.  ఇప్పుడు ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఎవరు ఊహించిన విధంగా ట్రోల్ జరుగుతుంది. అసలు అమ్మింది 15 కోట్లకు.. సరే లాస్ వస్తే 15 కోట్లు రావాలి… వాళ్ళు చెప్పినట్టు వంద కోట్లు వచ్చినా… అమ్మిన షేర్ వెయ్యి కోట్లు. అనవసరంగా ఇప్పుడు కేలుక్కుని మెగా ఫ్యాన్స్ వాసన చూస్తున్నారు. దీనితో దేవర ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, విశ్వంభర ఏ సినిమా వచ్చినా సరే చుక్కలు చూపిస్తాం అని వార్నింగ్ లు ఇస్తున్నారు. అయినా మెగా ఫ్యాన్స్ కంట్రోల్ అవడం లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా దిల్ రాజు మునిగినట్టే. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం వదిలే ఛాన్స్ కనపడటం లేదు .
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: