రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న ఈ సినిమాను తిరిగి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా విడుదల అయిన సమయంలో ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసింది. ఏ రేంజ్ రికార్డులను సృష్టించింది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ సినిమా 2002 వ సంవత్సరం నవంబర్ 11 వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయింది. ఇక మొదటి రోజు మొదటి షో కే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజే కోటి రూపాయల వరకు షేర్ కలక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి ఐదు కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ 47 కేంద్రాలలో 50 రోజులు , 12 కేంద్రాలలో 100 రోజులను పూర్తి చేసుకుంది.
ఇలా ప్రభాస్ హీరోగా రూపొందిన మొదటి సినిమా అయినటువంటి ఈశ్వర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసి కమర్షియల్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా మంచి రికార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రభాస్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. కొంత కాలం ప్రభాస్ కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకొని ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది.