ప్రభాస్ బర్త డే స్పెషల్: ప్రతి పుట్టినరోజుకు చేసే ఏకైక పని ఇదే.. దట్ ఈజ్ డార్లింగ్..!

Thota Jaya Madhuri
ఈరోజు మన డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు. ఈరోజు కోసం చాలామంది రెబల్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . దానికి కారణం నేడు ప్రభాస్ పెళ్లిపై ప్రకటన రాబోతుంది అంటూ గతంలో వార్తలు వినిపించడమే . గతంలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు ఒక గుడిలో దేవుడిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు . ఈ సంవత్సరంలోనే మనం  ఎంతగానో ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ వినబోతున్నాము అని.. ప్రభాస్ పెళ్లి వార్త త్వరలోనే వింటామని అభిమానులకి మంచి కిక్కించే న్యూస్ చెప్పింది .


అయితే ఈ సంవత్సరానికి ఇంకా రెండు నెలలే మిగిలి ఉంది. కచ్చితంగా ఈ రెండు నెలల్లో ప్రభాస్ పెళ్లి వార్త అఫీషియల్ గా ప్రకటించాలి. చాలామంది తన బర్త డే స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ అభిమానులకు తన పెళ్లి డేట్ ను చెప్పబోతున్నాడు అంటూ మాట్లాడుకున్నారు . ఆ స్పెషల్ అనౌన్స్ మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ప్రభాస్ బర్త డే సందర్భంగా ఆయన తన ప్రతి పుట్టినరోజుకు చేసే పని గురించి సోషల్ మీడియాలో విపరీతమైన టాక్ వినిపిస్తుంది .


ప్రభాస్ చాలా చాలా సాంప్రదాయంగా ఉంటాడు . సాంప్రదాయాలకు ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటాడు . అది అందరికీ తెలిసిందే . కాగా ప్రభాస్ చిన్నప్పటి నుంచి తన బర్త్డ డే అంటే ముందుగాదేవుడి దగ్గర దండం పెట్టి..ఆ తరువాత తల్లిదండ్రులకి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకొని ఆ తర్వాత  ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడట. అయితే ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి మాత్రం ప్రభాస్ తన బర్త్డ డే రోజు కచ్చితంగా అనాధ పిల్లలకు తనకు వీలైనంతవరకు అన్నదానం చేస్తూ ఉంటారట .


ఒకసారి వందమంది.. ఒకసారి వెయ్యి మంది.. ఒకసారి 10,000 మంది ఒకసారి లక్ష మంది ఇలా ఆయన స్తోమత బట్టి ఆయన చేయగలిగినంత సహాయం చేస్తూనే ఉంటాడట. మరీ ముఖ్యంగా ప్రభాస్ ప్రతి పుట్టినరోజుకు హైదరబాద్ లోని అనాధ శరణాలయంలో కచ్చితంగా వెయ్యి మందికి పైగానే విందు భోజనాలతో వాళ్ళ కడుపు నింపుతాడట. ప్రతి పుట్టినరోజుకి కూడా ప్రభాస్ ఇదే పని చేస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది . అంతేకాదు ప్రభాస్ డార్లింగ్ అని పిలిచేది ఊరికే కాదు ఇందుకే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . మరి ఇంత మంచి మనసు ఉన్న  ప్రభాస్ కి మనం కూడా హ్యాపీ బర్త డే విషెస్ చెప్పేద్దామా..? హ్యాపీ బర్త డే.."డార్లిం హీరో ప్రభాస్"..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: