ప్రభాస్ ను ప్రేమించి.. ఆ ఇద్దరు హీరోయిన్లు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారట తెలుసా?

praveen
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ గా కొనసాగుతున్న టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మాటల్లో కూడా వర్ణించలేం. సాధారణంగా ఒక హీరో సినిమాని ఒక భాషా ప్రేక్షకులు మాత్రమే అలరీస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ సినిమా వచ్చిందంటే ఇండియాలో మాత్రమే కాదు ఇతర దేశాల్లో కూడా ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు.  ఆ రేంజ్ లో క్రేజ్ పెంచేసుకున్నాడు ప్రభాస్. ఇక ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ తో తలకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నాడు. గత కొంతకాలం నుంచి వరుసగా సూపర్ హిట్లు సాధిస్తూ ఫుల్ స్పీడ్ చూపిస్తున్నాడు ప్రభాస్.

 ఇక ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగానే ఉన్నాడు అని చెప్పాలి. కాగా నేడు ప్రభాస్ పుట్టిన రోజు 44వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు ఈ పాన్ ఇండియా స్టార్. ఈ క్రమంలోనే ఆయన పెళ్లి గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ప్రతిసారి ప్రభాస్ ఎక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడిన పెళ్లి గురించి ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ఇక అప్పుడు ఏదో ఒక సమాధానం చెబుతూ తప్పించుకుంటూ ఉంటాడు డార్లింగ్ ప్రభాస్. అయితే ఇప్పుడు డార్లింగ్ గురించి ప్రభాస్ తో ప్రేమాయణం కారణంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఇద్దరు ఉన్నారంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఆ ఇద్దరు హీరోయిన్లు కూడా ప్రభాస్ తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు వరకు చేశారు.

 ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో కాదు అనుష్క, త్రిష. త్రిష ప్రభాస్ తో పౌర్ణమి సినిమా చేయగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన వర్షం సెన్సేషనల్ విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత బుజ్జిగాడు సినిమాలోని ఈ కాంబో రిపీట్ అయింది. ఇక అనుష్కతో బిల్లా సినిమాలో కలిసినట్టు నటించి హిట్టు కొట్టిన ప్రభాస్ ఆ తర్వాత మిర్చి బాహుబలి బాహుబలి 2 సినిమాల్లోని నటించారు. అయితే గతంలో ప్రభాస్ త్రిష ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి.


వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండడానికి కూడా అభిమానులు కోరుకున్నారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత అనుష్క తో వరుస సినిమాలు చేయడంతో వీరిద్దరి జోడి బాగుందని.. ఈడు జోడి సరిపోయిందని పెళ్లి చేసుకుంటే బాగుండని అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే అటు త్రిష ఇటు అనుష్కలు కూడా ప్రభాస్ తో ప్రేమాయణం కారణంగానే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: