రామ్ చరణ్ మంచి మనసుకు శభాష్ అనాల్సిందే.. నిర్మాతలకి అన్ని కోట్లు వెనక్కి ఇచ్చారా.?
- నిర్మాతలకి బంగారు బాతు..
- సినిమాలు ప్లాప్ అయితే రెమ్యూనరేషన్ వెనక్కి..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత మూవీతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి ఈ హీరో కేవలం సినిమాలోనే కాదు ఎవరినైనా ఆదుకోవడంలో కూడా ముందుంటారు.. అయితే ఇప్పటివరకు తన సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలను రాంచరణ్ ఎలా ఆదుకున్నారో ఇప్పుడు చూద్దాం..
నిర్మాతలను ఆదుకున్న ఘనుడు:
రామ్ చరణ్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే అందులో కొన్ని సినిమాలు కలెక్షన్లు కూడా రాకుండా భారీ డిజాస్టర్ అయ్యాయి.అయితే అలాంటి కొన్ని సినిమాలకు రాంచరణ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా వెనక్కి ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.అయితే అందులో ఒకటి ఆరెంజ్.. నాగబాబు నిర్మాతగా చేసిన ఆరెంజ్ మూవీ నవంబర్ 26, 2010లో వచ్చి భారీ డిజాస్టర్ అయింది.రామ్ చరణ్ జెనీలియా కాంబోలో వచ్చిన ఈ మూవీ బిజినెస్ చేయలేదు.దాంతో ఈ మూవీ భారీ డిజాస్టర్ అవ్వడంతో నిర్మాత సొంత బాబాయ్ కావడంతో రామ్ చరణ్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమా చేశారు. ఇక ఆరెంజ్ మూవీ వల్ల నాగబాబు ఎంతో నష్టపోయారు. అయితే ఈ సినిమా మళ్లీ రీ రిలీజ్ లో రికార్డు సృష్టించి భారీ లాభాలను తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా వల్ల వచ్చిన లాభాలను నాగబాబు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆరంజ్ సినిమా అప్పటి జనరేషన్ కి కాకుండా ఇప్పటి జనరేషన్ కి కరెక్టుగా సెట్ అవ్వడంతో ఈ మూవీ రీ రిలీజ్ లో భారీ హిట్ అయింది.