ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయినా...నిర్మాతను మెప్పించిన మాస్ మహారాజ్..!

FARMANULLA SHAIK
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రైడ్’కు రీమేక్‍గా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించారు.అసలు కధలో చాలా మార్పులు చేసి కమర్షియల్ అంశాలు జోడించి ఈ మూవీని చిత్రికరించారు అయితే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి.85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు మాత్రమే వసూలు చేసి దర్శక నిర్మాతలకు భారీ షాక్ ఇచ్చింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు టీ సిరీస్, పనోరమ స్టూడియోస్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. ఈ మూవీ థియేట్రికల్ హక్కులను తీసుకొని రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్.
నిజానికి ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు మరీ బీభత్సమైన అంచనాల్లేవు కానీ మిరపకాయ్ కాంబినేషన్ అవడంతో కొస మెరుపు అంచనాలైతే ఉన్నాయి.దానికి తోడు టీజర్, ట్రైలర్‌లు సైతం కాస్త ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. పైపెచ్చు లాంగ్ హాలీడేస్ రావడంతో కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా సరే,రవన్నకు తిరుగులేని కంబ్యాక్ అవుతుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు.కానీ అనుకున్నదానికి రివర్స్ జరిగి రవితేజ అభిమానులకి నిరాశ మిగిల్చింది.
బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంతో మేకర్స్ కు భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.దీంతో డైరెక్టర్ హరీష్ శంకర్ కీలక నిర్ణయం తీసుకొని తన రెమ్యునరేషన్ నుంచి రూ.6 కోట్లను నిర్మాతకు ఇచ్చేసారు అయితే దాంట్లో రూ.2 కోట్లు డైరెక్ట్ గా ఇచ్చినట్లు మరో నాలుగు కోట్ల రూపాయలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై చేయనున్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రెమ్యూనరేషన్ లో తీసుకోమని విశ్వప్రసాద్ కు హరీష్ చెప్పారట.హరీష్ శంక‌ర్ చేసిన ప‌నికి మాస్ మహారాజాతో పాటు ఆయన ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.ఈ సినిమాకు హీరో రవితేజ రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని అలాగే సినిమా సక్సెస్ కాలేదని 4కోట్లు రెమ్యూనరేషన్ తగ్గించుకొని తిరిగిచేసారని ఇండస్ట్రీ వర్గాల నుండి తెలుస్తుంది.అయితే రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో చాలా కరాకండిగా ఉంటారని ఇండస్ట్రీలో పేరు ఉంది అలాంటిది రవితేజ చేసిన ఇలాంటి పనికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా మిస్టర్ బచ్చన్ పేరు మీద నిర్మాత ఏకంగా 20 కోట్ల వరకు నష్టపోయినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: