మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. తనదైన నటన, డ్యాన్సులు, ఫైట్లతో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు రామ్ చరణ్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇందులో అతను చేసిన డ్యాన్సులు, ఫైట్స్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టాయి.ఇలా సినిమాల్లో గ్లోబల్ స్టార్ గా ఓ రేంజ్ లో వెలిగిపోతోన్న రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కనుందన్న సమాచారం తెలిసిందే.అదేంటంటే.. లండన్ లోని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారట.ప్రస్తుతం గ్లోబల్ స్టార్ పాపులారిటీ, ఫాలోయింగ్ ను గమనించిన మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ కు కూడా వెళ్ళివచ్చారు రామ్ చరణ్. అక్కడ తన విగ్రహ తయారీకి కావలసిన కొలతలను ఇచ్చినట్టు సమాచారం. ఇక మేడమ్ టుస్పాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసే రామ్ చరణ్ మైనపు విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. రామ్‌చరణ్ ఫ్రెంచ్ బార్బేట్ జాతికి చెందిన కుక్క పిల్ల రైమ్‌ను తనతో పెంచుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా రైమ్‌ను తీసుకెళ్లడం రామ్‌చరణ్ దంపతులకు అలవాటు. అందుకే ఇప్పుడు కూడా రైమ్‌ను ఎత్తుకుని ఉన్న రామ్‌చరణ్ మైనపు బొమ్మనే మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయనున్నారన్న సంగతి తెలిసిందే.ఇదిలావుండగా ప్రపంచంలోని అనేకమంది ప్రముఖుల మైనపు విగ్రహాలు అచ్చం వారిలాగే తయారుచేసి మేడం టుస్సాడ్స్ కి సంబంధించిన మ్యూజియమ్స్ లో పెడతారు.
భారతదేశానికి చెందిన ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల మైనపు బొమ్మలను ఏర్పాటు చేయగా ఇప్పుడీ జాబితాలోకి రామ్ చరణ్ కూడా వచ్చి చేరారు. ఈ విషయాన్ని అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధితులు అధికారింగా ప్రకటించారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్రీ మైనపు బొమ్మ తయారీ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా టూస్సాడ్ మ్యూజియం ప్రతినిధులు ఓ ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు. రామ్ చరణ్ విగ్రహాన్ని సింగపూర్‌లోని తమ మ్యూజియంలో వచ్చే ఏడాది వేసవిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.ఇదిలా ఉంటే ఈ అరుదైన గౌరవం లభించడంపై రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో మేడం టుస్సాడ్ ప్రతినిధులు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో తన మైనపు విగ్రహం పెట్టడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. త్వరలోనే మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో కలుద్దామని చెప్పుకొచ్చారు.దీనికి సంబంధించిన ఫొటో షూట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.