దివాళా దిశగా బాలీవుడ్... కరణ్ జోహార్ కన్నా సాక్ష్యం కావాలా..?
ఇటీవల వచ్చిన స్త్రీ 2 మినహాయిస్తే వసూళ్లు అందుకుని హిట్ అనిపించుకున్న సినిమా ఒకటి లేదు. అసలు వరుస డిజాస్టర్లతో చాలా సంస్థలు అయిపోయాయి. బడా బడా నిర్మాతల సైతం సినిమాలకు దూరం అవుతున్నారు. తాజాగా కరణ్ జోహార్ సైతం తన ధర్మా ప్రొడక్షన్స్ లో 50% వాటా అమ్ముకోవాల్సి వచ్చింది. బాలీవుడ్ పతనం అవుతుంది అనటానికి ఇంతకు మించిన పెద్ద ఉదాహరణ అవసరం లేదని భారత దేశ సినిమా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బాలీవుడ్ లో జోరుగా సినిమాలు తీస్తూ సౌత్ సినిమాలను అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే పెద్ద నిర్మాణ సంస్థ కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్.
అయితే ఆ సంస్థకు ఇటీవల వరుసగా ఫ్లాప్‌లే తగిలాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న జిగ్రా కూడా దారుణంగా నిరాశపరిచింది. ధర్మా ప్రొడక్షన్స్ నష్టాల్లో ఉందని ఈ కంపెనీని త్వరలోనే కరణ్ జోహార్ మూసేస్తారని.. లేదంటే ఈ సంస్థను అమ్మకానికి పెడతారని బాలీవుడ్లో గట్టిగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తన సంస్థలోని 50% వాటాన్ని దాదాపుగా 1000 కోట్లకు సారన్ ప్రొడక్షన్స్ కు కరణ్ జోహార్ అమ్మేశారు. ఇకనుంచి కరణ్ జోహార్ ప్రొడక్షన్స్ ఆ సంస్థకు అప్పగిస్తారని ఆయన క్రియేటివి వర్క్ చూసుకుంటారని తెలుస్తోంది. కరణ్ మాత్రమే కాదు బాలీవుడ్ లో పేరుగాంచిన చాలా నిర్మాణ సంస్థలు ఇప్పుడు ఇదే బాటలో ప్రయాణం చేయబోతున్నాయి. వరుసగా బడా హిట్‌లు పడితే తప్ప బాలీవుడ్ ఇప్పటిలో కోలుకునే పరిస్థితి అయితే లేదు.