' పుష్ప 2 ' టార్గెట్ మొత్తం అక్కడే... పిచ్చెక్కిస్తోన్న ప్లానింగ్...!
ఇక ఇప్పుడు పుష్ప 2 పై భారీగా అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్లో.. మరీ ముఖ్యంగా నార్త్‌లో చాలా రాష్ట్రాలలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. బన్నీ స్టైల్ పాన్ ఇండియా ప్రచారం చేయాలంటే కనీసం నెల రోజులు టైం పడుతుంది. చిన్న చిన్న మీటింగ్ పెట్టి వదిలేసే రకం కాదు బన్నీ. పైగా పుష్ప 2 మీద బన్నీ చాలా గురి పెట్టాడు. భారీ స్థాయిలో రికార్డులు బ్రేక్ చేయాలని కసితో ఉన్నాడు. అందువల్ల ప్రచారానికి కనీసం నెల రోజులు కావాలి. పైగా రొటీన్ పార్ట్లు వదలడం, కంటెంట్ వదలడం సరిపోదు.. అంతకుమించి కావాలి.
ఇప్పుడు అదే ప్లాన్ తో ఉన్నట్టు తెలుస్తోంది. బన్నీ టార్గెట్ మొత్తం నార్త్ ఇండియా మీద ఉందని తెలుస్తోంది. ఒక భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో ప్లాన్ చేస్తున్నారట. దేవర ట్రైలర్ అయితే ముంబైలో లాంఛ్ చేశారు. తెలుగులో కనీసం ఈవెంట్ కూడా చేయలేదు. అందువల్ల పుష్ప 2 మాత్రం తెలుగులో పెద్ద ప్రయారిటీ ఇచ్చే ఆలోచనలు లేదని తెలుస్తోంది. బన్నీ గురి మాత్రం బాలీవుడ్ మార్కెట్ నార్త్ ఇండియా మీదే ఉందని తెలుస్తోంది. అందుకే జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. జాతీయ మీడియాలో పాపులర్ షోలకు హాజరు కావడం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.