ఈ మధ్య కాలంలో తెలుగులో వరుస పెట్టి సినిమా చేస్తున్న దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటుడు మొదటగా తెలుగులో మహానటి అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఈ మూవీలోని దుల్కర్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు రావడంతో ఈ సినిమా ద్వారా ఈయనకు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటుడు తెలుగు లో సీత రామం అనే సినిమాలో హీరోవ్గా నటించాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈయన క్రేజ్ మరింత గా తెలుగు లో పెరిగింది.
ఇకపోతే తాజాగా ఈ నటుడు తెలుగు లో లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... వెంకీ అట్లూరి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు రన్ టైం ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు /ఏ సర్టిఫికెట్ లభించినట్లు , ఈ మూవీ ని 2 గంటల 30 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.