అదే జరిగితే పుష్ప2 మళ్లీ వాయిదా పడినట్లేనా..? ఏంటి సుకుమార్ ఈ చెత్త పని..?

Thota Jaya Madhuri
సుకుమార్ తీసుకున్న ఒక్కే ఒక్క నిర్ణయం ఇప్పుడు పుష్ప2కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చేలా చేస్తుంది. అంతేకాదు బన్నీ ఫాన్స్ కు బాగా మండిస్తుంది . మనకు తెలిసిందే ప్రెసెంట్ బన్నీ ఫాన్స్ ఎంత ఫైర్ మీద ఉన్నారో. సోషల్ మీడియాలో తల తోక లేని మనుషులు కూడా బన్నీ ను ఓ  రేంజ్ లో ట్రోల్ చేసేస్తున్నారు.  మరీ ముఖ్యంగా ఆయనను పొలిటికల్ పరంగా లాగుతూ దారుణాతి దారుణమైన పదాజాలంతో దూషిస్తున్నారు అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం . ఎటువంటి మీమ్‌స్ బన్నీ పై ట్రోల్ చేస్తున్నారు కూడా చూస్తున్నాం.  అయితే వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే పుష్ప2 సినిమా రిలీజ్ అవ్వాలి ..ఆ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలి ..బన్నీ లెవెల్ వేరే రేంజ్ లో మారాలి.


అప్పుడే బన్నీ ఫాన్స్ కూడా సంతోషిస్తారు.  ఆ మూమెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫాన్స్ . అయితే సుకుమార్ తీసుకున్న ఒకే ఒక్క డెసిషన్ ఇప్పుడు పుష్ప2 సినిమా మళ్లీ వాయిదా పడేలా చేయబోతుంది అంటూ  ఓ న్యూస్ వైరల్ గా మారింది . పుష్ప 2 సినిమా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది.  డిసెంబర్ 6వ తేదీ గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని పుష్ప2  మేకర్స్ అఫీషియల్ గా కూడా ప్రకటించారు . అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదట . 90% షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయిందట . ఇంకా ఒక ఐటెం సాంగ్ రెండు బడా ఫైట్ సీన్స్ తెరకెక్కించాలట . హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ సీన్స్ మళ్లీ షూట్ చేయాలి అని సుకుమార్ డిసైడ్ అయ్యాడట.


ఆల్రెడీ క్లైమాక్స్ సీన్స్ షూట్ చేసినా.. కొన్ని సిచువేషన్ ల  కారణంగా ఆ సీన్స్ ను రీ షూట్ చేయడానికి నిర్ణయించుకున్నారట.  అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్ లోనే ప్రమోషన్స్ చేయాలి . పోయినసారి పుష్ప1 కి అసలు పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ నిర్వహించలేకపోయారు సుకుమార్ - బన్ని. ఈసారైనా పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ చేయడానికి పక్క ప్లాన్ తో ముందుకు వెళ్లాలి అంటూ సిద్ధపడ్డారు .


అయితే సుకుమార్ కొన్ని సీన్స్ బాగా లేవు అన్న కారణంగా మళ్ళీ రీ షూట్స్ చేస్తూ టైం మొత్తం వేస్ట్ చేసేసారు. ఇంకా ఒక పాట అదేవిధంగా రెండు కీలక సీన్స్  షూటింగ్ పెండింగ్ ఉంది అంటే అది చాలా చాలా బాడ్ థింగ్ అంటున్నారు జనాలు . అంతేకాదు ఇప్పటికే సినిమా షూట్ కంప్లీట్ అయిపోయి సినిమా ప్రమోషన్స్ పనులు కూడా స్టార్ట్ చేయాలి. నవంబర్ వచ్చేస్తుంది.. డిసెంబర్ మొదటి వారంలో సినిమా రిలీజ్. కేవలం 30 రోజులు అంటే 30 రోజుల్లో సినిమాకి ఏమాత్రం ప్రమోషన్స్ నిర్వహిస్తారు..?  అది కూడా పాన్ ఇండియా లెవలో ..? ఏం చేస్తున్నావ్ సుకుమార్.. సినిమాను అసలు  డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేసే ఆలోచన ఉందా లేదా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు. ఒకవేళ సుకుమార్ అనుకున్న టైంలోపు సినిమా షూట్ కంప్లీట్ చేయకపోతే మరొకసారి పుష్ప2 వాయిదా పడడం కన్ఫామ్ అంటున్నారు సినీ విశ్లేషకులు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: