చిరంజీవి-జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మిస్ అయిన బిగ్ మల్టీస్టారర్ మూవీ ఇదే..చేసుంటే కెరియర్ మటాష్..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్లు ఎక్కువగా చూస్తున్నాం . మరీ ముఖ్యంగా బడా బడా హీరోలు ..పాన్ ఇండియా స్టార్స్ కూడా మల్టీస్టారర్ మూవీలో నటిస్తూ ఉండడం గమనార్హం. జనాలు కూడా అలాంటి సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో డైరెక్టర్ లు ఎక్కువగా అలాంటి క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు . అయితే ఇండస్ట్రీలో బడా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి .. అదేవిధంగా సినిమా డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింఘ్ట వైరల్ గా మారాయి . చిరంజీవితో సినిమా అంటే ఏ స్టార్ హీరో కూడా రిజెక్ట్ చేయరు . అది అందరికీ తెలిసిందే. 


జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అంటే అసలకే నో చెప్పడానికి నోరు కూడా రాదు. వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమాని ప్లాన్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ.  అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. " అరవింద సమేత వీర రాఘవ".. మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా టైం గ్యాప్ తీసుకొని ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా బిగ్ హిట్ అయింది.  ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ మరొక సినిమాను అనుకున్నాడు . ఆ సినిమాలో చిరంజీవిని కూడా ఒక లీడ్ క్యారెక్టర్ లో చూపించాలి అని ఆశపడ్డారు.  అటువంటి ఒక  స్పెషల్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీని రెడీ చేసుకున్నారు.


అయితే ఈ స్టోరీ చిరంజీవికి జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పగా నో అంటూ ఫస్ట్ లైన్లోనే తెగేసి చెప్పేసారట . "ఇటువంటి స్టోరీస్ తెలుగు జనాలకు పెద్దగా నచ్చవు అలాంటి సినిమాలు తెరకెక్కిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది . అది కూడా పెద్ద స్టార్స్ తోనా ..? అస్సలు కుదరదు" అంటూ చిరంజీవి అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు రిజెక్ట్ చేశారట . అయితే కొరటాల శివ ఓన్ టాలెంట్ తో అదే కధను అటు ఇటుగా మార్చి ఆ తర్వాత చిరంజీవి - రామ్ చరణ్ తో ఆచార్య సినిమాను తెరకెక్కించారట .


ఆ సినిమా ఎంత ఫ్లాప్ అయిందో మనకు తెలిసిందే. అయితే కొంతమంది చిరంజీవి .. కొరటాల డైరెక్షన్లో వేలు పెట్టాడు అని.. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయిందని అంటుంటే మరి కొంతమంది మాత్రం అది కొరటాల ఓన్ టాలెంట్ అని ...అందులో ఎవరు వేలు పెట్టాల్సిన అవసరం లేదు అని ట్రోల్ చేశారు . మొత్తానికి  జూనియర్ ఎన్టీఆర్ బిగ్ డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు . ఒకవేళ ఆ ప్రాజెక్టును ఓకే చేసి ఉంటే కెరియర్ నిజంగా ఢమాల్ అంటూ పడిపోయేది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: