రాజా సాన్ తో వాళ్లకి నోరుమూయిస్తాడా..?

shami
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజా సాబ్ పోస్టర్ తన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ అల్ ట్రా స్టైలిష్ గా కనిపించనున్నాడు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కి రాజా సాబ్ టీజర్ రాబోతుంది. దానికంటే ముందే ప్రభాస్ పోస్టర్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు. ఐతే రాజా సాబ్ లేటెస్ట్ పోస్టర్ చూసిన వారికి ముఖ్యంగా నర్త్ ఆడియన్స్ కి షాక్ తగలక తప్పదు.
బాహుబలి నుంచి ప్రభాస్ కి నార్త్ ఆడియన్స్ ఫాలోయింగ్ పెరిగింది. బాహుబలి నుంచి ఈమధ్య వచ్చిన కల్కి వరకు మాక్సిమం ప్రభాస్ సీరియస్ పాత్రలే చేశాడు. కల్కి లో కొంత కామెడీ రోల్ చేసినా ఆయన ఫుల్ లెంగ్త్ కామెడీ టైమింగ్ తో చేస్తే ఎలా ఉంటుందో రాజా సాబ్ చూపించబోతుంది. అంతేకాదు ప్రభాస్ ప్రతి సినిమా రిలీజైన ప్రతిసారి అతని లుక్స్ మీద బాలీవుడ్ రివ్యూయర్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు.
అందుకే రాజా సాబ్ తో అది కూడా మార్చే ప్లానింగ్ లో ఉన్నారు. డైరెక్టర్ మారుతి టేకింగ్ ఆయన సినిమాలు ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటాయో తెలిసిందే. అందుకే రాజా సాబ్ పోస్టర్స్ నుంచి ప్రతిదీ స్పెషల్ గా అనిపిస్తుంది. మరి రాజా సాబ్ ప్రభాస్ నార్త్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందా అక్కడ రివ్యూయర్స్ కి తన ఎనర్జీతో నోరు మూసేలా చేస్తాడా అన్నది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ సరసన మలయాళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో అమ్మడు బిజీ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. అందుకే రాజా సాబ్ రిలీజ్ ముందు వరకు వేరే ఆఫర్లు వస్తున్నా మాళవిక సైన్ చేయట్లేదని చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: