రకుల్ : స్టార్ హీరోయిన్ స్టేటస్.. అయినా తోటి హీరోయిన్లు చేసిన పని ఎందుకు చేయలేదు..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ స్టార్ హీరోయిన్స్ చేసేవారు కాదు. కానీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో పరిస్థితులు చాలా వరకు మారాయి. ఎక్కువ శాతం స్పెషల్ సాంగ్స్ ని స్టార్ హీరోయిన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ గా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో చాలా మంది ఐటెం పాటలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎక్కువ శాతం స్పెషల్ సాంగ్స్ లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్లలో తమన్నా ముందు వరుసలో ఉంటుంది. ఈమె ఇప్పటికే ఎన్నో స్పెషల్ పాటలలో నటించి తన డాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇక పూజ హెగ్డే కూడా ఇప్పటికే కొన్ని సినిమాల్లోని ఐటెం పాటలకు డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఇక కాజల్ అగర్వాల్ కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి తన డ్యాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సమంత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఐటమ్ పాటలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా చాలా కాలం పాటు కెరియర్ను కొనసాగించిన రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇప్పటి వరకు ఏ సినిమాలోని ఐటమ్ సాంగ్స్ లలో నటించలేదు.

ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కంటే కూడా తమిళ్ , హిందీ సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. ఈమె ఆఖరుగా తెలుగులో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈమె ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలో నటించలేదు. అలాగే ఏ తెలుగు మూవీ కి ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: