ఆ మూవీ నుండి ఆ హీరోయిన్ను తీసేయాలన్న ప్రొడ్యూసర్.. ఒక్క మాటతో అంతా మార్చేసిన పవన్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఒక సారి మాట ఇచ్చాడు అంటే ఆ మాట తప్పడు అని ఓ దర్శకుడితో సినిమా చేస్తాను అంటే ఆ దర్శకుడికి ఆ ముందు అట్టర్ ప్లాప్ లు ఉన్న పెద్దగా పట్టించుకోడు అని , మాట ఇచ్చాడు అంటే అతనితో సినిమా చేస్తాడు అనే ఒక గొప్ప పేరు ఉంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా ... హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ మూవీ ని నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ లకు వరసగా ఫ్లాప్ లు ఉన్నాయి. అలాగే ఈ మూవీ నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ కు కూడా ఈ సినిమా కంటే ముందు ఒక విజయం కూడా లేదు. ఇది ఇలా ఉంటే గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్లో భాగంగా ఈ మూవీ నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ... గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకోవాలి అని అనుకున్నారు.

దానితో నేను పవన్ కళ్యాణ్ గారితో వద్దు సార్ ... ఆ అమ్మాయికి అన్ని ఫ్లాప్ లే ఉన్నాయి. మనం వేరే అమ్మాయిని హీరోయిన్గా తీసుకుందాం అన్నాను. దానితో పవన్ కళ్యాణ్... నువ్వు తీసినవేమన్నా పెద్ద హిట్లు ఉన్నాయా. అవన్నీ ఏమీ పట్టించుకోకు. సినిమా కథ బాగుండి ... సినిమాను జనాలకు నచ్చే విధంగా తీస్తే హిట్ అవుతుంది. అమ్మాయి వల్ల ఏమీ కాదు అని చెప్పాడు. దానితో శృతి హాసన్ హీరోయిన్గా తీసుకున్నాం అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: