ఏపీ హైకోర్టును ఆశ్రయించిన బన్నీ.. ఆ కేసు నుంచి బయటపడటం సాధ్యమేనా?

Reddy P Rajasekhar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా పుష్ప ది రూల్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. పుష్ప ది రూల్ కొన్ని ఏరియాలలో ఆర్.ఆర్.ఆర్ మూవీ బిజినెస్ రికార్డులను బ్రేక్ చేసింది. అయితే బన్నీ నంద్యాల లో వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన సమయంలో బన్నీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ బన్నీ హైకోర్టును ఆశ్రయించారు.
 
ఈ కేసు విషయంలో బన్నీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. బన్నీ ఈ కేసు నుంచి బయటపడే ఛాన్స్ ఉందో లేదో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఈ కేసు వల్ల బన్నీకి భవిష్యత్తులో సైతం కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
 
బన్నీ అనుమతులు లేకుండా నంద్యాలలో ప్రచారంలో పాల్గొనగా ఎక్కువ సంఖ్యలో జనం హాజరు కావడంతో ఈ సమస్య ఎదురైంది. అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్తరనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అయితే ఈ కేసు మరీ పెద్ద కేసు కాబట్టి బన్నీ సులువుగానే బయటపడతారనే చర్చ సైతం జరుగుతుండటం కొసమెరుపు.
 
పవన్ కు వ్యతిరేక పార్టీ అయిన వైసీపీ తరపున ప్రచారం చేయడం వల్ల పుష్ప2 కలెక్షన్లపై కొంతమేర ప్రభావం పడుతుందని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పుష్ప2 వాయిదాకు ఈ వివాదమే కారణమనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పిటిషన్ విషయంలో ఏపీ హైకోర్టు తీర్పు కోసం బన్నీ ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బన్నీ కేసు విషయంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: