"ముగ్గురు మొనగాళ్ళు"తో టాలీవుడ్ ను షేక్ చేసిన చిరంజీవి ?
ఈ సినిమాని ఆయన సోదరుడు నాగబాబు స్వయంగా నిర్మించడం జరిగింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నాగబాబు నిర్మించారు. అప్పట్లో ఘరానా మొగుడు సినిమా సక్సెస్ అనంతరం చిరంజీవి నటించిన సినిమా ఇది. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి మూడు భిన్నమైన పాత్రలలో అద్భుతంగా నటించారు. అందుకుగాను తన గొంతును, వాయిస్ ను ఈ సినిమాలో పూర్తిగా మార్చేశారు.
ఇందులో చిరంజీవికి జోడిగా రోజా, రమ్యకృష్ణ, నగ్మా హీరోయిన్లుగా నటించారు. ఈ క్రమంలోనే సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పట్లో గ్రాఫిక్స్ వాడుతున్నారు. కానీ అప్పట్లో ఎలాంటి గ్రాఫిక్స్ వాడలేరు. హీరోలు డబుల్ లేదా త్రిపుల్ రోల్ చేయాల్సి వస్తే డూప్ లను మాత్రమే వాడేవారు. ఈ క్రమంలోనే చిరంజీవికి ఈ సినిమాలో ఇద్దరు డూప్ ల అవసరం వచ్చింది.
ఈ సినిమాలో చిరంజీవికి డూప్ లుగా ఆయన వద్ద పనిచేస్తున్న పిఏ సుబ్బారావు, చిరంజీవి స్నేహితుడు నటుడు ప్రసాద్ రావు నటించారు. మీరు ఎత్తు, బరువు చిరంజీవికి సమానంగా ఉంది. కనుకనే ఈ సినిమాలో చిరంజీవికి వీరు డూప్ పాత్రలను పోషించారు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో వీరు చిరంజీవికి డూప్ లుగా నటించారు. కాగా, ముగ్గురు మొనగాళ్లు సినిమా ఘనవిజయం సాధించి రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది.