త్రిపాత్రాభినయంతో నట విశ్వరూపం చూపించిన ఎన్టీఆర్.. ఈ తరం హీరోలకు ఆ రేంజ్ నటన కష్టమే..?

murali krishna


* నటనలో తాతకు తగ్గ మనవడిగా రానిస్తున్న ఎన్టీఆర్..
* ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా ఎన్టీఆర్ రెడీ
* టాలీవుడ్ ఆల్ రౌండర్ గా గుర్తింపు సాధించిన ఎన్టీఆర్..
మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో ఎందరో అభిమానులను సంపాదించు కున్నాడు.. స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ఎంతగానో రానించారు.. అయితే ఎన్టీఆర్ నటించిన సినిమాలు ప్లాప్ అయినా కూడా ఆయన నటనకు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది . ఈ తరం స్టార్ హీరోలలో నటనలో బెస్ట్ హీరో ఎవరంటే మాత్రం వెంటనే ఎన్టీఆర్ పేరే చెబుతారు.. ఒక్క నటన లోనే కాదు డాన్స్ పరంగా, డైలాగ్స్ పరంగా కూడా ఎన్టీఆర్ ఇతర హీరోల కంటే ఎంతో మెరుగ్గా వున్నారు.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ కాలం నుంచి డ్యూయల్ రోల్ పాత్రలు ఎంతగానో ఫేమస్..అన్న ఎన్టీఆర్ త్రిపాత్రభినయం కూడా చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.. అలా నేటి తరం నటులలో త్రిపాత్రాభినయంతో మెప్పించిన హీరో కూడా ఎన్టీఆర్ కావడం విశేషం.. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం లో వచ్చిన ‘జై లవ కుశ’ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి ఎంతగానో మెప్పించారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు.

యాక్షన్ సన్నీవేశాలలో, ఎమోషనల్ సన్నివేశాల లో, కామెడీ సన్నీ వేశాలలో ఇలా ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించారు.. ఈ సినిమాలో జై అనే నత్తి వచ్చే పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది.. దర్శకుడు బాబీ అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఎంతగానో ఆకట్టుకున్నాడు..ఈ సినిమాకు మెయిన్ హైలైట్ మ్యూజిక్ రాక్ స్టార్ దేవిశ్రీ అందించిన సాంగ్స్, బిజిఎం మాత్రం సూపర్ గా గా ఉంటుంది.. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి అదే రేంజ్ మాస్ ట్యూన్స్ ఇవ్వడంలో దేవిశ్రీ సక్సెస్ అయ్యారు.. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: