నాగార్జున: అదరహో అనిపించిన హలో బ్రదర్.. డబల్ యాక్షన్ లో కూడా దబిడి దిబిడే.!

Pandrala Sravanthi
- ఆకాశానికి అక్కినేని ఫ్యామిలీని తీసుకెళ్లిన ఘనుడు..
- ఏఎన్ఆర్ నట వారసుడిగా  ఎంతో గుర్తింపు..
- ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే హీరో నాగార్జున..

 నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి గుర్తింపు సాధించిన హీరో. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నాగార్జున కెరియర్లో చెప్పుకోదగ్గ అద్భుతమైన చిత్రంలో హలో బ్రదర్ ఒకటి. ఈ చిత్రంలో నాగార్జున నటన గురించి ఒక్క మాటలో చెప్పుకోలేం. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేసి అభిమానులను ఎంతగానో మెస్మరైజ్ చేశాడు.. అలాంటి ఈ చిత్రం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం..
 1994 లో ఇండస్ట్రీ హిట్ అయిన చిత్రాల్లో హలో బ్రదర్ కూడా ఒకటి. ఈవివి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం  భారీ విజయాన్ని సాధించింది. సరికొత్త స్టోరీ తో  ఆడియన్స్ను ముందుకు తీసుకెళ్లాలని భావించిన ఇవివి తనకు బాగా నచ్చినటువంటి హాలీవుడ్ సినిమా  ట్విన్ డ్రాగన్ స్టోరీని నాగార్జునకు చెప్పారంట. ఇక ఈ కథ నాగార్జునకు ఎంతగానో నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ విధంగా వచ్చినటువంటి  ఈ చిత్రానికి ఎల్బి శ్రీరామ్ డైలాగులు రాశాడు. డబల్ యాక్షన్ లో నటించిన నాగార్జున  సరసన హీరోయిన్లుగా రమ్యకృష్ణ,సౌందర్య నటించారు. కవలల కాన్సెప్ట్ తో వచ్చినటువంటి ఈ చిత్రం  చాలా కొత్తగా అనిపిస్తుంది.  

కామెడీ,లవ్, ఫైట్స్ ఇలా అన్ని కోణాల్లో ఈ చిత్రాన్ని అద్భుతమైనటువంటి మూవీగా తెరకెక్కించారు ఈవివి సత్యనారాయణ. 1994 ఏప్రిల్ 20న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం  ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. కలెక్షన్స్ లో కూడా రికార్డులు బద్దలు కొట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంధ్య థియేటర్లో  దాదాపు 120కి పైగా షోలు ప్రతిరోజు హౌస్ ఫుల్ అయ్యి రికార్డు సృష్టించింది. 2.50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 15.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అదరహో అనిపించింది. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున కెరియర్ ఎంతో మారిపోయింది అని చెప్పవచ్చు.  అలా నాగార్జున ద్విపత్రాభినయం చేసిన హలో బ్రదర్ సినిమా ఇప్పటికి కూడా టెలివిజన్లో వస్తే చాలామంది ఇష్టంగా చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: