పెళ్ళై పిల్లలున్న హీరోపై మోజు పడ్డ ఐశ్వర్య రాజేష్.?

Pandrala Sravanthi
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అంటే ప్రస్తుతం ఫేమస్ హీరోయిన్.. ఎందుకంటే ఒకప్పుడు ఈమె తెలుగులో ఎలాంటి అవకాశాలు లేక తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా మారి ఎంతోమంది హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది.అయితే తమిళంలో హీరోయిన్ల అందం చూడరు. వారి నటనా టాలెంట్ మాత్రమే చూస్తారు. అందుకే అక్కడ కాస్త కలర్ తక్కువ ఉన్నా సరే హీరోయిన్లను ఆదరిస్తారు.అలా తెలుగు హీరోయిన్ అయిన అంజలికి కూడా తమిళంలోనే మంచి గుర్తింపు దక్కింది. అయితే అలాంటి తెలుగు నటి అయినటువంటి ఐశ్వర్య రాజేష్ గురించి కోలీవుడ్లో గత కొద్దిరోజుల నుండి ఒక వార్త చక్కర్లు కొడుతుంది.అదేంటంటే..ఐశ్వర్య రాజేష్ పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న హీరోని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది అంటూ ఒక వార్త ఇండస్ట్రీని కుదిపేయడంతో చాలామంది ఇది నిజమేనా అని భావించారు.

 మరి ఇంతకీ ఐశ్వర్య రాజేష్ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని వస్తున్న ఆ హీరో ఎవరయ్యా అంటే..విజయ్ సేతుపతి.. హీరోగా...విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయిపోయిన విజయ్ సేతుపతి అంటే తెలియని వారు ఉండరు. అయితే అలాంటి విజయ్ సేతుపతికి ఐశ్వర్య రాజేష్ కి మధ్య ఎఫైర్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.దానికి కారణం వీళ్లిద్దరి కాంబోలో పదికి పైగా సినిమాలు రావడమే.

అలా ఒక హీరో హీరోయిన్ కాంబోలో రెండు సినిమాలు వస్తేనే వార్తలు వైరల్ చేసే ఇండస్ట్రీ జనాలు వీరిద్దరి మధ్య పది సినిమాలు వచ్చేసరికి ఎన్ని రూమర్లు పుట్టిస్తారో చెప్పనక్కర్లేదు. అలా దాదాపు 10 సినిమాల్లో కలిసి నటించిన విజయ్ సేతుపతి ఐశ్వర్య రాజేష్ మధ్య కూడా ఈ వార్తలు వినిపించాయి. అంతేకాదు విజయ్ సేతుపతి తన భార్య జెస్సీకి విడాకులు ఇచ్చి ఐశ్వర్య రాజేష్ ని రెండో వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యారని కూడా ఊహగణాలు వచ్చాయి. కానీ ఇందులో ఏది నిజం కాలేదు.. అవి రూమర్లుగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: