చిరు ఆ నిర్ణయం తీసుకోవడం వెనక పవన్ కూడా ఉన్నాడా.. కానీ ముందుకు వచ్చింది చరణ్..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూ వీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బింబిసార మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని చాలా రోజుల క్రితమే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది.

ఈ మూవీ టీజర్ విడుదల కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ మూవీ యూనిట్ మాట్లాడుతూ ... ఈ సినిమాను జనవరి 10 వ తేదీన విడుదల చేయాలి అనుకున్నాం. కాకపోతే రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. అందుకే మా సినిమా విడుదల తేదీ కోసం ప్రకటించిన జనవరి 10 వ తేదీన చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీ విడుదల అవుతుంది అని ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర మూవీ ని వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక చిరంజీవి కేవలం చరణ్ కోసం మాత్రమే కాకుండా పవన్ కోసం కూడా చాలా దూరంలో విశ్వంభర మూవీ ని విడుదలకు ఉంచినట్లు కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. ఎందుకు అంటే పవన్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దానితో పవన్ సినిమాకు కూడా పోటీగా ఉండకూడదు అనే ఉద్దేశంతో చిరంజీవి ఏకంగా మే 9 వ తేదీన విశ్వంభర మూవీ ని విడుదల చేయాలి అని డిసైడ్ అయినట్లు కొంత మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: