భారీ ధరకు అమ్ముడుపోయిన గేమ్ చేంజర్ కర్ణాటక హక్కులు.. మాస్ రాంపేజ్ కి అంతా సిద్ధం..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత తన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో చరణ్ ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే తాజాగా చరణ్ , శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించగా ... ఎస్  ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పాడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క కర్ణాటక ధియేటర్ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క కర్ణాటక హక్కులను బెంగళూరు కుమార్ ఫిలిమ్స్ సంస్థ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను కర్ణాటక లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: