ఆ విషయంలో రామ్ చరణ్ ని లాగి పెట్టి కొట్టిన తల్లి సురేఖ.. అంత పెద్ద తప్పు ఏం చేశాడో తెలుసా..?
ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . కాగా ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలోనే ఒక సినిమా చేయబోతున్నాడు మన రామ్ చరణ్ . ఇలాంటి మూమెంట్లోనే చరణ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. రామ్ చరణ్ తల్లి సురేఖ ఆయనను లాగి పెట్టి కొట్టిందట . దానికి కారణం మరొక హీరో కావడం గమనార్హం. అది కూడా మెగా హీరోనే. ఆయన మరెవరో కాదు వరుణ్ తేజ్ .
వరుణ్ తేజ్ కారణంగా సురేఖ ..రామ్ చరణ్ ను లాగిపెట్టి కొట్టిందట. చిన్నతనంలో చరణ్ చాలా మొండి వాడిగా ఉండే వాడట . నా వస్తువు ఏదైన నాదే అన్నట్లు బిహేవ్ చేసేవాడట . శ్రీజ - సుస్మితలను కూడా తన బొమ్మలను టచ్ చేయించేవాడు కాదట . అంత మొండిగా ఉండేవాడట రాంచరణ్ . ఇదే మూమెంట్లో ఒకసారి వరుణ్ ..చరణ్ బొమ్మ తీసుకొని పగలకొట్టేశాడట. ఆ బొమ్మ పోయింది అన్న కోపంతో వరుణ్ తేజ్ ని కొట్టబోయాడట. దీంతో అక్కడే ఉన్న సురేఖ అది మంచి పద్ధతి కాదు అంటూ నచ్చ జెప్పిన వినలేదట. కోపంతో సురేఖ లాగిపెట్టి చరణ్ ని కొట్టిందట . ఆ తర్వాత సముదాయిస్తూ ఏది మంచి ఏది చెడు అంటూ ఆయనకు వివరించిందట . చిన్నప్పుడు అలా చేయడం వల్లనే ఇప్పుడు రామ్ చరణ్ ఇంత మంచి పద్ధతులు నేర్చుకున్నాడు అంటున్నారు మెగా ఫాన్స్. అంతేకాదు సురేఖ పెంపకాన్ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!