తమన్నాకు కోట్లలో ఫాలోవర్లు.. ఫ్యాన్స్‌కు ఎప్పుడూ కనుల విందే..

Suma Kallamadi

* సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్
* సోషల్ మీడియా క్వీన్ గా తమన్నాకి పేరు  
* ఫ్యాన్స్ కు ఎప్పుడూ కనులవిందు చేస్తుంది  
( ఏపీ - ఇండియా హెరాల్డ్)
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హ్యాపీడేస్ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఊసరవెల్లి, రచ్చ, బాహుబలి సినిమాలతో చాలామందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ అందం, నటనతో ఎంతో మంది మనసులు దోచుకుంది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో కూడా అంతే ఫేమస్ అయిపోయింది.
ఒకానొక సమయంలో ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ చేసిన సర్వే ప్రకారం, దక్షిణ భారతదేశంలో సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలో అయ్యే స్టార్స్‌లో తమన్నా పదో స్థానంలో ఉంది. అంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో, ఆమె పోస్ట్‌లు ఎంత మంది చూస్తున్నారో విశ్లేషించి ఈ లిస్ట్‌లో ఆమె స్థానాన్ని నిర్ణయించారు. ఈ ముద్దుగుమ్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్లు 70 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
తమన్నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన జీవితం గురించి ఎన్నో విశేషాలను పంచుకుంటుంది. ఇన్‌స్టా బయో ప్రకారం తమన్నాకు  కాఫీ అంటే చాలా ఇష్టం. రోజూ కాఫీ తాగకుండా ఉండలేదు. ఆమెకు కవిత్వం రాయడం కూడా ఇష్టం. అప్పుడప్పుడు తన ఫీలింగ్స్‌ను కవితల రూపంలో వ్యక్తపరుస్తుంది. అంతేకాదు, ఈ మిల్కీ బ్యూటీకి డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. తమన్నా తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటుంది. తన లేటెస్ట్ పిక్స్ మాత్రమే కాకుండా చైల్డ్ హుడ్ పిక్స్ కూడా షేర్ చేస్తూ అలరిస్తుంది. ఆమెను ట్విట్టర్ లో @tamannaahspeaks అనే అకౌంట్‌ పనిచేస్తుంది అక్కడ కూడా కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు.
ఇటీవల తన ఫ్యాన్స్‌ని సంతోషపెట్టడానికి తమన్నా తన చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చిన్నప్పుడు ఆమె ఎంత క్యూట్‌గా ఉందో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. https://www.instagram.com/p/C_7B2C2SzOQ/?utm_source=ig_web_copy_link
ఇకపోతే ఈ బ్యూటిఫుల్ అడ్రస్ తాజాగా గువాహటిలోని కామాక్ష్య దేవాలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంది. ఇంతకు ముందు ఆమె పేరు ఒక మనీ లాండరింగ్ కేసులో వచ్చింది. ఇలాంటి సమయంలో ఆమె ఆలయ దర్శనం ప్రత్యేకంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: