పవన్ ఫ్యాన్స్ ను కలవర పెడుతున్న టైటల్స్ మ్యానియా !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలతో బిజీగా మారిపోవడంతో భవిష్యత్ లో పవన్ నుంచి పెద్దగా సినిమాలు వచ్చే ఆస్కారంలేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పవన్ నటిస్తున్న మూడు సినిమాలు తప్ప మరొక సినిమా పవన్ కు చేసే ఉద్దేశ్యం లేదు అని అంటున్నారు. దీనితో పవర్ స్టార్ అభిమానుల ఆశలు అన్నీ అకిరా నందన్ పైనే ఉన్నాయి.

ప్రస్తుతం అకిరా ఆమెరికాలో డిగ్రీ చేస్తూ అక్కడ కూడ పియానో క్లాసులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ అభిమానులు మాత్రం అకిరా ను హీరోగా చూడాలని ఆశ పడుతున్నారు. ఆ ఆశలు ఇంకా నెరవేరకుండానే పవన్ సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ వేరే యంగ్ హీరోలు కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోవడం పవర్ స్టార్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

యాంకర్ గా గుర్తింపు పొందిన ప్రదీప్ మాచిరాజు నటిస్తున్న లేటెస్ట్ సినిమాకు ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ టైటిల్ ను సొంతం చేసుకుంటే విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ టైటిల్ ను వాడుకున్నారు. ఇప్పుడు ఈ రేస్ లోకి హీరో పవన్ కళ్యాణ్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడుగా భావించే నితిన్ తన లేటెస్ట్ సినిమాకు ‘తమ్ముడు’ టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నాడు.

ఇలా పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బష్టర్ హిట్స్ గా పేరున్న సినిమాల టైటిల్స్ అన్నీ కబ్జా అయిపోతే నిజంగా అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు అతడి సినిమాకు పవన్ టైటిల్ తో సినిమా టైటిల్ ఫిక్స్ చేయాలి అంటే టైటిల్స్ కొరత ఏర్పడే ఆస్కారం ఉంది అంటూ అభిమానులు కలవరపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిమానులు అకిరా ని హీరోగా చూడాలి అనుకుంటే అకిరా అభిరుచి మాత్రం మ్యూజిక్ పై ఉండటంతో అభిమానుల కోరిక ఎంతవరకు నెరవేరుతుంది అన్న సందేహాలు చాలమందిలో ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: