టాలీవుడ్: ఒక్క సినిమాతోనే బిఛాన ఎత్తేసిన సీనియర్ హీరో కొడుకు పరిస్థితి.?

FARMANULLA SHAIK
భాను చందర్.. ఇప్పటి తరానికి కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుసు కానీ.. అసలు ఒకప్పుడు భాను చందర్ సంచలనం. 80వ దశకంలో భాను చందర్ యుఫోరియా మాములుగా ఉండేది కాదు..అసలు ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ వెర్రెత్తిపోయేవాళ్లు. 1978లో వచ్చిన మన ఊరి పాండవులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత బెబ్బులి, ఆడవాళ్లు మీకు జోహార్లు, సత్యం శివం.. ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోయాడు. 1986లో వచ్చిన నిరీక్షణ సినిమా భాను చందర్‌కు హీరోగా ఒక రేంజ్‌లో బ్రేక్ ఇచ్చింది.అసలు ఈ సినిమా ఆడియెన్స్‌లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. సినిమా రిలీజైన టైమ్‌లో ఒక యుఫోరియా క్రియేట్ అయింది. ఈ ఒక్క సినిమాతో భాను చందర్ స్టార్ హీరో స్టేటస్ తెచ్చుకున్నాడు.ఆ తర్వాత పలు బ్యాక్ టు బ్యా్క్ హిట్లతో కొంత కాలం టాప్ స్టార్‌గా కొనసాగాడు. అయితే ఒక టైమ్‌లో వరుస ఫ్లాపు భాను చందర్ కెరీర్ గ్రాఫ్‌ను పూర్తిగా తగ్గించేశాయి. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు.అన్నట్లు భాను చందర్‌ సినీ వారసత్వాన్ని నిలబట్టేందుకు ఆయన కొడుకు జయంత్ భాను చందర్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. నా కొడుకు బంగారం అనే తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జయంత్. 2013లో రిలీజైన పెద్దగా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ కు భాను చందరే దర్శకత్వం వహించారు. లుక్స్, యాక్టింగ్ పరంగా జయంత్ ఆకట్టుకున్నా సక్సెస్ కాకపోవడంతో జయంత్ పేరు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఆ తర్వాత కూడా జయంత్ పెద్దగా లు చేయలేదు. దీంతో అతను ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వేరే వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడని తెలుస్తోంది.ఇదిలావుండగా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నారీ సీనియర్ యాక్టర్. ముఖ్యంగా పోలీసాఫీసర్ పాత్రలు వేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే రెండు ల్లో నటించారు భాను చందర్. రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్, మ్యూజిక్ షాప్ మూర్తి ల్లో ఆయన కీలక పాత్రలు పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: