షారుక్ ఖాన్ చివరి కోరిక అదేనట.. షాక్ లో ఫ్యాన్స్..!
షారుఖ్ ఖాన్ ఇండియన్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను లోకర్నో ఫిలిం ఫెస్టివల్ లో ఒక పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. అలాగే తన చిట్ట చివరి కోరిక కూడా అదే అంటూ తెలిపారట షారుఖ్ ఖాన్.. ఈ చివరి కోరిక వింటే ఎవరైనా సరే ఈయనకు సినిమాల పైన ఉన్న పిచ్చి ఎలాంటిదో అర్థమవుతుంది. ఒక మీడియా ప్రతినిధి మీరు జీవితాంతం ఇలా నటుడుగానే కొనసాగిస్తారా అంటూ షారుఖ్ ను ప్రశ్నించగా.. చాలా విభిన్నంగా ఆన్సర్ చెప్పారు.
తాను మరణించేవరకు సినిమాలలోనే ఉంటాను అంటూ తేల్చి చెప్పేశారు.. తాను ఏదైనా సినిమా షూటింగ్ సెట్లో షూటింగ్ చేస్తూ ఉండగానే తాను మరణించాలని.. తెలిపారు షారుఖ్ ఖాన్.. ఇదే తన జీవితంలో చివరి కోరిక అన్నట్టుగా తన మనసులో మాటను సైతం తెలియజేశారు. అయితే ఈ విషయం విన్న అభిమానులు షారుఖ్ సినిమాల మీద ఉన్న పిచ్చి ఎలాంటిదో ఈ మాటలలోనే అర్థమవుతోంది అంటూ కామెంట్స్ చేస్తూ.. ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు.. అలాగే మీరు స్టార్డం కి ఎలా ఫీలవుతారు అని ప్రశ్నించగా.. స్టార్డం అనే విషయాన్ని గౌరవిస్తానని దీనివల్లే అభిమానుల ఆదరణ గుర్తింపు డబ్బు వస్తుందంటూ తెలియజేశారు. మొత్తానికి షారుఖ్ ఖాన్ తన చివరి కోరికను బయటపెట్టేశారు.