సూప‌ర్‌స్టార్ కృష్ణ ట్రిఫుల్ యాక్ష‌న్‌తో అద‌ర‌గొట్టిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా స్పెష‌ల్ ఇదే..!

RAMAKRISHNA S.S.
సూపర్ స్టార్ కృష్ణ త్రిపత్రాభినయం చేసిన సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ సినిమా గురించి ఈ తరం సినీ ప్రేక్షకులకు ఎవరికీ తెలియదు. కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన కుమార రాజా సినిమా.. 1978లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుమారరాజా అంటే ఇద్దరు కృష్ణులు ఒక కృష్ణ పేరు కుమార్.. మరో కృష్ణ పేరు రాజా. కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన శంకర గురు అనే సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. కన్నడ హీరో రాజకుమార్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా వచ్చింది. కన్నడంలో ఆయనకు జోడిగా జ‌య‌మాల, పద్మప్రియ, కాంచన హీరోయిన్లుగా నటించారు.

రాజ్ కుమార్ స్వ‌యంగా మూడు పాత్రలు ఆయనే వేశారు. తర్వాత కాలంలో తమిళంలో త్రిశూలం పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. శివాజీ గణేషన్ ఇందులో నటించారు. హిందీలో అమితాబచ్చన్ మూడు పాత్రలు వేశారు. అక్కడ వహీదా రెహమాన్, పర్వీన్ బాబి, జీన‌త్ అమ‌న్‌ హీరోయిన్గా నటించారు. ఇక మన తెలుగులో ఇదే సినిమా కృష్ణతో రీమేక్ చేశారు. మూడు పాత్రలు కృష్ణ పోషించారు. పెద్ద కృష్ణుడికి జంటగా జయంతి జోడిగా నటించారు. ఇద్దరు చిన్నకృష్ణులకు జంటగా జయప్రద, లతా నటించారు.

అడవి రాముడు సినిమా తెరకెక్కించిన సత్య చిత్ర బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. పర్వతనేని సాంబశివరావు దర్శకుడు. కృష్ణ మూడు పాత్రలు చాలా బాగా నటించారు. ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. చాలా బాగం కశ్మీర్లో షూటింగ్ చేశారు. జంధ్యాల డైలాగులు అదిరిపోయాయి. అడవి రాముడు తర్వాత ఇది ఆయనకు రెండో సినిమా. డైలాగులు బాగా పేలాయి. కె.వి.మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు బయట అయితే పెద్దగా క్లిక్ కాలేదు. కాగా రొటీన్ క‌థ అయిన కృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేయటం ప్రేక్షకులకు మంచి కేక్ ఇచ్చి సినిమాను సూపర్ హిట్ చేసింది. ఆ రోజుల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: