టాలీవుడ్ హీరోల దండయాత్ర దెబ్బకు బాలీవుడ్ హీరోల బెంబేలు... బీ టౌన్‌లో సీక్రెట్‌గా..!
2023లో కనీసం గదర్ 2 - జవాన్ - పఠాన్ - యానిమల్ లాంటి సినిమాలు రప్ఫాడించాయి. 2024లో అయితే మరీ దారుణం అని చెప్పాలి. ఇప్పటికే 10 నెలలు గడిచి పోయింది. ఒక్క స్త్రీ 2 మినహాయిస్తే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ఒక్కటి అంటే ఒక్కటీ లేదు. మధ్యమధ్యలో హనుమాన్, కల్కితో పాటు రీసెంట్‌గా దేవర అంటూ మన టాలీవుడ్ హీరోలే అక్కడి బాక్సాఫీస్‌కు అండగా నిలిచాయి అంటే బాలీవుడ్ లో పరిస్థితి ఈ యేడాది ఎంతకు దిగజారిపోయిందో తెలుస్తోంది.
అయితే ఇప్పుడు మాత్రమే కాదు... సమీప భవిష్యత్తు లో కొన్నేళ్ల పాటు ఇదే జరిగేలా కనిపిస్తుంది. 2025లోనూ బాలీవుడ్ లో అయితే భారీ సినిమాలేం వచ్చేలా లేవు. కండల వీరుడు... ఖాన్ దాదా అయిన సల్మాన్ ఖాన్ సికిందర్ వస్తున్నా.. మునపట్లా భాయ్ మ్యాజిక్ చేస్తారా అన్న అనుమానాలు చాలా ఎక్కువ గానే ఉన్నాయి. ఇక అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్ లాంటి హీరోల మార్కెట్ ఇప్పటికే చాలా డౌన్ అయిపోయిందంటే నమ్మాల్సిందే.. వీళ్ల సినిమాలు వస్తున్నాయంటే మినిమం ఓపెనింగ్స్ డౌటే.
ఇక వార్ 2 ఒక్కటే కాస్త ప్రామిసింగ్‌గా కనిపిస్తుంది.. అందులోనూ హృతిక్ రోషన్‌తో పాటు మన జూనియర్ ఎన్టీఆర్ ఉండడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక డిసెంబర్ 6న పుష్ప 2తో బాలీవుడ్‌ను రూల్ చేయడానికి బయల్దేరుతున్నారు బన్నీ. సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్‌తో రామ్ చరణ్ రాబోతున్నారు. ప్రభాస్ స్పిరిట్.. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా.. సలార్ 2 ఇలా చాలా సినిమాలు బాలీవుడ్‌ను వచ్చే రెండేళ్లలో కమ్మేయబోతున్నాయి.