వామ్మో: మాఫియా డాన్ తో యవ్వారం నడిపిన హీరోయిన్.. కట్ చేస్తే..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కొత్తగా పరిచయమవుతూ ఉంటారు.. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఒకప్పుడు మాత్రం చాలా మంది హీరోయిన్స్ డైరెక్టర్లు పరిచయం చేయడం జరిగింది. ముఖ్యంగా డైరెక్టర్ రాఘవేంద్రరావు ఎంతోమంది హీరోయిన్స్ ఇతర భాషల నుంచి కూడా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తాజ్ మహల్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ మోనికా బేడి.. ఈమె తెలుగులో తక్కువ సినిమాలే నటించిన బాలీవుడ్ లో భారీ అవకాశాలను అందుకున్నది.

వాస్తవానికి ఈమె పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఇమే తల్లిదండ్రులు ఢిల్లీ చేరడంతో ఉద్యోగరీత్యా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిందట. అలా తెలుగులో తాజ్ మహల్, సోగ్గాడి పెళ్ళాం, చూడాలని ఉంది, శివయ్య తదితర చిత్రాలలో నటించిందట. అయితే ఈ అమ్మడి కెరియర్  పిక్స్ లో ఉన్న సమయంలో ఎన్నో వివాదాలలో చిక్కుకున్నది. సెప్టెంబర్ 2002లో నకిలీ పత్రాల విషయంలో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన అబూ సలెం అనే భారతీయ గ్యాంగ్స్టర్ తో చేతులు కలపడంతో  అరెస్టు కావడం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసిందట.దీంతో ఈమె జైలు శిక్షణ కూడా అనుభవించిందనీ సమాచారం.

2006లో ఫేక్ పాస్పోర్టులు సంపాదించుకోవడంతో ఈమె న్యాయస్థానం కూడా దోషిగా నిర్ధారించిందట. ఇలా మాఫియా డాన్లతో ఇలాంటి దొంగ పాస్పోర్టులతో చేజేతులారా తన కెరీర్నే నాశనం చేసుకుంది. మోనిక బేడి హిందీ బిగ్ బాస్ -2 లో పాల్గొన్న ఆ తర్వాత పలు రకాల టీవీ షోలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేకపోయింది. అప్పట్లో తన అందంత మాఫియా డాన్లను కూడా తన వైపు తిప్పుకునేలా చేసిందనే విషయాలు కూడా బాలీవుడ్ లో ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి.. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది మోనికా బేడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: